ఆటో ఇండస్ట్రీ లేకుండా 5లక్షల కోట్ల...అసాధ్యం...

Ashok Kumar   | Asianet News
Published : Dec 18, 2019, 12:53 PM IST
ఆటో ఇండస్ట్రీ లేకుండా 5లక్షల కోట్ల...అసాధ్యం...

సారాంశం

ఆర్థిక మాంద్యం మధ్య చిక్కుకున్న ఆటోమొబైల్ రంగం భాగస్వామ్యం లేకుండా భారతదేశం వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడం కష్టమేనని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా, మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా తేల్చేశారు.  

ముంబై: ఆర్థిక మందగమనం వల్ల దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమ లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడం అసాధ్యమని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా చెప్పారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏటా దేశ జీడీపీ 1.2 ట్రిలియన్ల డాలర్ల (12 శాతం)కు చేరుకోవాల్సి ఉంటుందని ముంబైలో జరిగిన ఇండియా కాంక్లేవ్‌లో పవన్ గోయెంకా మాట్లాడుతూ పేర్కొన్నారు. తద్వారా మాత్రమే 5 లక్షల కోట్ల డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని పవన్ గోయెంకా అన్నారు. 

also read  బీఎస్-6 ఎఫెక్ట్: డీలర్ల ఆఫర్లపై ఇంట్రెస్ట్ చూపని హైదరాబాదీలు

భారతీయ ఆటోమొబైల్ రంగం సైనికుల్లా ఎల్లవేళలా సేల్స్ పెంచుకోవడానికి, ఆటోమొబైల్ సంస్థలకు పూర్వ వైభవం తేవడానికి ఆయా సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం కూడా కీలకమే. భారత జీడీపీలో అందునా ఉత్పాదక రంగ జీడీపీలో ఆటోమొబైల్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆర్థికమాంద్యం ప్రభావం దీనిపైనా గణనీయంగానే ఉంటుంది. 

ఒకవేళ ఆర్థిక వ్యవస్థ 8.5 శాతానికి పెరిగితే ఉత్పాదక రంగం వార్షిక గ్రోత్ రేటు 12.5 శాతానికి చేరుకుంటుంది. ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివ్రుద్ధి చెందాల్సిన అవసరం ఉందని పవన్ గోయెంకా చెప్పారు. భారతీయ ఆటోమొబైల్ రంగం విక్రయాలు 15 శాతానికి పైగా పడిపోయింది.

ఇది రెండు దశాబ్దాల దిగువ నాటితో సమానం. దేశీయ మార్కెట్‌తోపాటు ఎగుమతుల్లోనూ పురోగతి సాధించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ వాహనాల రంగంలో విప్లవం సాధించాల్సి ఉంటుందని చెప్పారు పవన్ గోయెంకా. భారతదేశం, గ్లోబల్ మార్కెట్లలో అంతరాయం చాలా తక్కువగా ఉంటుందన్నారు.

మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సమూల మార్పులు తీసుకురావాలంటే ఆర్థిక రంగ మౌలిక వసతులు అభివ్రుద్ధి చేయడం అవసరం అని అభిప్రాయ పడ్డారు. ప్రజల వ్యవహరశైలిలో సమూల మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాశ్చాత్య దేశాల తరహా యాజమాన్య పద్ధతులను అవలంభిస్తే విజయం సాధించగలమని ఆర్సీ భార్గవ చెప్పారు.

also read ఇంటర్నెట్‌తో బైక్.. తెలంగాణ, ఏపీల్లో ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఎంజీ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ గత పదేళ్లుగా లక్ష్యాలను సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు. ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం అంటే అది ఒక నంబర్ గానే మిగిలిపోతుందన్నారు. 

కాలుష్య నియంత్రణకు, ఇంధన సేఫ్టీపై దీర్ఘ కాలిక పాలసీ అమలు చేయాల్సి ఉంటుందని ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. కాగా, భారత ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. టూ వీలర్స్ విభాగంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉంటే, వాణిజ్య వాహనాల్లో ఏడో స్థానంలో నిలుస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు