గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన చైనా విద్యుత్ టూ వీలర్ ఈవీ టెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రుష్ణపట్నం పోర్టు వద్ద ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లలో రూ.710 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే ఎక్స్‌పోలో తొలుత బైక్‌ను ప్రదర్శించేందుకు డావో ఈవీటెక్ ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్: గ్లోబల్ టూవీలర్స్ సెగ్మెంట్‌లో ఉన్న డావో ఈవీటెక్ సంస్థ ఇండియన్ మార్కెట్‌లోకి వస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో, తమ తొలి ఈవీ ప్రొడక్ట్ (లో స్పీడ్ వేరియంట్ ను) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ డైరెక్టర్, సీఎఫ్‌ఓ బాలాజీ అచ్యుతుని చెప్పారు. హైస్పీడ్ వేరియంట్లను ఏప్రిల్‌లో తీసుకొస్తామని వెల్లడించారు.
లో స్పీడ్ వేరియంట్ల కాస్ట్ రూ.50 వేల నుంచి రూ.75 వేల మధ్యలో ఉన్నాయి. హై స్పీడ్ వేరియంట్ల కాస్ట్ రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందని డావో ఈవీటెక్ సీఎఫ్ఓ బాలాజీ అచ్యుతుని తెలిపారు. ఫిబ్రవరిలో 10 నుంచి 15 మోడల్ బైక్స్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
undefined
also read మారుతి సుజుకి నుండి 12 కొత్త మోడల్ కార్లు... 6 లక్షలకు పైగా సేల్స్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్ట్‌కు 50 కి.మీ నుంచి 60 కి.మీ సమీపంలో మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు డావో ఈవీటెక్ సీఎఫ్ఓ బాలాజీ అచ్యుతుని వెల్లడించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల స్థలం కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆరు నెలల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.700 కోట్లు) వరకూ పెట్టుబడులు పెట్టి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తొలి దశలో 3 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), డైరెక్టర్ అచ్యుతుని బాలాజీ తెలిపారు.
ఈ ప్లాంట్ నుంచి తొలి ప్రొడక్ట్‌ను నవంబర్‌లో తీసుకొస్తామని డావో ఈవీటెక్ సీఎఫ్ఓ బాలాజీ అచ్యుతుని తెలిపారు. రెండు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, మరో రెండు నుంచి మూడు వేల మందిని నియమించుకుంటామని చెప్పారు.
మొత్తంగా మూడేళ్లలో 100 మిలియన్ డాలర్లు(రూ.710 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్టు డావో ఈవీటెక్ సీఎఫ్ఓ బాలాజీ అచ్యుతుని ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికిల్ అడాప్షన్‌ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం హై స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది.
చైనాలో డావో ప్రస్తుతం 150కి పైగా ఎలక్ట్రిక్ వేరియంట్లను విక్రయించింది. ఇండియాలో కూడా మరిన్ని మోడల్స్‌ను తేవాలని చూస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ నుంచి 125 కి.మీ వరకు ఈ బైక్ ప్రయాణించగలదు. మూడేళ్ల వారంటీతో విద్యుత్ వాహనాలను ఆవిష్కరిస్తోంది.
డావో ఈవీటక్ తన వాహనాలకు ప్యాన్ ఇండియా బేసిస్‌లో డావో డీలర్ నెట్ వర్క్ వద్ద లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీసు ఆఫర్ చేస్తోంది. ఈ వెహికిల్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ. లో స్పీడ్ గంటకు 25 కి.మీ. వార్షికంగా డావో 15 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లను ప్రొడ్యూస్ చేస్తోంది.
also read కారు కొనాలనే వారికి ఇదే కరెక్ట్ టైం...బ్రాండెడ్ కార్లపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు
మూడు లక్ష్యాలతో ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్టు డావో టెక్ సీఈవో, ఛైర్మన్ మైఖేల్ లియూ చెప్పారు. ఒకటి ఇండియన్ కస్టమర్లకు ఆహ్లాదకరమైన ఫ్యూచర్‌ను అందించాలని, రెండోది బెస్ట్‌కు భారతీయులు ఎల్లప్పుడూ అర్హులేనని, మూడు యంగ్ ప్రొఫెషనల్స్‌ను డీలర్లుగా డెవలప్ చేయాలని, వారిని సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రిన్యూర్లుగా చూడాలని అనుకుంటున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను పూర్తిగా 2023ఈవీల్లో కి మార్చాలని చూస్తున్నట్టు డావో ఈవీటెక్ గుర్తు చేసింది. ఈ నెల 19, 20వ తేదీల్లో న్యూఢిల్లీలో చైనా నైట్స్‌ను నిర్వహిస్తున్నారు.
విద్యుత్ వాహనాలకు భారత్ పెద్ద మార్కెట్ కాగలదని భావిస్తున్నామని, తొలిసారి భారత్‌లోనే ఇంటర్నెట్ కల వాహనాలను కంపెనీ ప్రవేశ పెడుతోందని డీఏఓ ఈవీటెక్ సీఓఓ లానా జు చెప్పారు. డీలర్ నెట్‌వర్క్ కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు.