హోండా కార్లపై బంపర్ ఆఫర్లు: రూ. 5 లక్షల వరకు తగ్గింపు

By narsimha lode  |  First Published Jan 15, 2020, 9:03 AM IST

భారతదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ అమలు గడువు దగ్గర పడుతోంది.


న్యూఢిల్లీ: భారతదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ అమలు గడువు దగ్గర పడుతోంది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లను మాత్రమే విక్రయించాలని తొలుత సుప్రీంకోర్టు.. తర్వాత కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీ లోపు బీఎస్-4 నిల్వలను విక్రయించుకోవడానికి కార్ల తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ కూడా జత కలిసింది. 2020, 2019 నిల్వలపైన రాయితీలు ప్రకటించింది. ఆ రాయితీలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..

హోండా కార్స్‌లో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు హోండా జాజ్.. పలు రకాల యుటిలిటీ నిల్వలకు వాడుకోవచ్చు. మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఎలైట్ ఐ20 మోడల్ కార్లతో హోండా జాజ్ పోటీ పడుతోంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ కార్లలో 2020 నిల్వలపై రూ.20 వేల క్యాష్, 20 వేల అదను బోనస్ అందిస్తోంది. 2019 నిల్వలపై 25 వేల చొప్పు క్యాష్ బ్యాక్, అదనపు బోనస్ అందిస్తోంది. 

Latest Videos

undefined

2019లో హోండా కార్స్ ఆవిష్కరించిన లేటెస్ట్ జనరేషన్ సెడాన్ కారు సివిక్. ఇది స్కోడా ఒక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా మోడల్ కార్లతో తలపడుతోంది. వీ సీవీటీపై రూ.1.5 లక్షలు, వీఎక్స్ మోడల్పై రూ.1.25 లక్షలు, జడ్ఎక్స్ సీవీటీ పై రూ.75 వేల రాయితీ ప్రకటించింది. అదనంగా వీఎక్స్, జడ్ఎక్స్ ట్రిమ్ మోడల్ కార్లపై రూ.25 వేల బోనస్ అందజేస్తుంది. మరోవైపు 2019లో ఉత్పత్తి చేసిన డీజిల్ కార్లపై రూ.2 లక్షలు, 2020 స్టాక్ పై రూ.2.5 లక్షల వరకు అదను డిస్కౌంట్ లభిస్తుంది. 

హోండా జాజ్ మోడల్ కారును బేస్ చేసుకుని హోండా డబ్ల్యూఆర్-వీ క్రాస్ హ్యాచ్ బ్యాక్ పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లపై కూడా ఆఫర్లు అందిస్తోంది. డబ్ల్యూఆర్-వీ 2020 స్టాక్ మీద రూ.20 వేలు, అదనపు బోనస్ కింద రూ.15 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. 2019 నిల్వలపై రూ.25 వేల క్యాష్, రూ.20 వేల అదనపు బోనస్ ప్రకటించింది. 

2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ ఆప్షన్లలో లభిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. సీఆర్-వీ 2డీ వేరియంట్ కార్లపై గరిష్టంగా రూ.4 లక్షలు, 4డబ్ల్యూడీ కార్లపై రూ.5 లక్షల డిస్కౌంట్ అందజేస్తోంది. 

హోండా కార్స్ ఎంట్రీ లెవెల్ కారు అమేజ్. హ్యుండాయ్ ఎక్స్ సెంట్, ఫోర్డ్ ఫిగో అస్పైర్, మారుతి డిజైర్ కార్లతో పోటీ పడుతున్నది. 2020 స్టాక్ పై రూ.20 వేల బోనస్, ఐదేళ్ల వారంటీ, 2019 నిల్వలపై రూ.30 వేల ఎక్స్చేంజ్ బోనస్, ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. 

click me!