సరికొత్త రికార్డు సృష్టించిన హోండా యాక్టివా...

By Arun Kumar P  |  First Published Oct 20, 2018, 1:41 PM IST

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ 18 ఏళ్ల గడువులో కొత్త రికార్డు నెలకొల్పింది. సంస్థ తయారు చేసే ‘హోండా యాక్టీవా’ను ఇప్పటివరకు రెండు కోట్ల మంది కొనుగోలు చేశారు.


న్యూఢిల్లీ: పండుగల సీజన్ మధ్యలోనే ప్రముఖ ద్విచక్ర వాహన విక్రయ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) శిఖలో మరో రికార్డు నమోదైంది. కంపెనీకి చెందిన స్కూటర్ యాక్టివా అమ్మకాల్లో రికార్డును సృష్టించింది. 2001లో దేశీయ రోడ్లపై పరుగులు తీసిన ఈ స్కూటర్ ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. తొలి కోటి యూనిట్లను విక్రయించడానికి 15 ఏళ్లు పట్టిన సంస్థ.. మరో కోటి స్కూటర్లను విక్రయించడానికి కేవలం మూడేళ్లు మాత్రమే పట్టింది.

ప్రపంచ స్కూటర్ విక్రయాల్లో తొలిస్థానంలో ఉన్న ‘హెచ్‌ఎంఎస్‌ఐ’.. గుజరాత్‌లోని విథ్లాపూర్ వద్ద ఏడాదికి 12 లక్షల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఉండగా, దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో ఆరు లక్షలకు పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. 

Latest Videos

undefined

ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) యద్వీందర్ సింగ్ మాట్లాడుతూ దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాది 2001లోనే 55 వేల యూనిట్లు అమ్ముడైన ఈ యాక్టివా స్కూటర్ 2003 నాటికి పది లక్షలకు చేరుకున్నాయన్నారు. మరో రెండేండ్లకాలంలో పది లక్షలకు చేరుకోగా, 2015 నాటికి కోటి యూనిట్లు అమ్ముడయ్యాయన్నారు.

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కం ప్రెసిడెంట్ మినోరు కాటో మాట్లాడుతూ 18 సంవత్సరాలకు పైగా ఐదు తరాలకు హోండా యాక్టీవా సేవలందిస్తున్నదన్నారు. ప్రతి భారతీయుడు ప్రాధాన్యం ఇచ్చే మోటార్ బైక్ యాక్టీవా అని పేర్కొన్నారు. తమ యాక్టీవాతో రెండు కోట్ల మంది వినియోగదారులను చేర్చుకోగలిగినందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు. నూతన కస్టమర్ల దరిని చేరుకోవడంతోపాటు నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

 

click me!