మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ మృతి.. ఆటో పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం..

By S Ashok Kumar  |  First Published Apr 26, 2021, 3:27 PM IST

ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ (78)  కన్నుమూశారు. 


మారుతి  సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు  జగదీష్ ఖత్తర్ గుండెపోటు కారణంగా  సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 78 . జగదీష్ ఖత్తర్ నాయకత్వంలో మారుతి భారతదేశంలో ఉన్నత స్థాయిని సాధించి, ప్రజలలో పాపులర్ బ్రాండ్‌గా మారింది.   

జగదీష్ ఖత్తర్ 1993 నుండి 2007 వరకు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ ఉన్నారు. 2007లో పదవీ విరమణ తరువాత అతను కార్ నేషన్ ఆటో అనే సొంత ఆటో సేల్స్ అండ్ సర్వీస్ సంస్థను స్థాపించాడు. 

Latest Videos

1993లో 
1993లో మారుతి ఉద్యోగ్  లిమిటెడ్ లో మార్కెటింగ్ డైరెక్టర్‌ గా చేరారు. తరువాత 1999లో అతను మొదటిసారి ప్రభుత్వ నామినీగా అలాగే మారుతి మేనేజింగ్ డైరెక్టర్ గా, 2002లో సుజుకి మోటార్ కార్పొరేషన్  నామినీగా ఎంపిక అయ్యారు. 

also read  

మారుతిలో చేరడానికి ముందు జగదీష్ ఖత్తర్  ఒక ఐ‌ఏ‌ఎస్ అధికారి. ఆయన ఉక్కు మంత్రిత్వ శాఖ ఇంకా యుపి  ప్రభుత్వంలో అనేక కీలక పరిపాలనా పదవులను నిర్వహించారు.  జగదీష్ ఖత్తర్ మరణ వార్తను మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ ధృవీకరించారు. ఆయన హఠాన్మరణం వ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని వ్యాఖ్యానించారురు. జగదీష్ ఖత్తర్‌ అకాల మరణంతో ఆటో పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

అతని నాయకత్వంలో మారుతి పరిశ్రమ 2000 - 2008 మధ్య 9,000 నుండి 22,000 కోట్ల వార్షిక ఆదాయంతో అతిపెద్ద సంస్థగా మారింది. దాని లాభం దాదాపు ఐదు రెట్లు పెరిగి 330 కోట్ల రూపాయల నుండి 1730 కోట్ల రూపాయలకు పెరిగింది.  

ఈ కాలంలో మారుతిని హ్యుందాయ్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఫియట్, హోండా వంటి విదేశీ దిగ్గజాలు సవాలు చేశాయి, కాని మారుతి  సేల్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. 2003-05 వరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (సియామ్) అధ్యక్షుడిగా కూడా జగదీష్ ఖత్తర్ పనిచేశారు. 

అతని పేరు 2019 సంవత్సరంలో ఒక వివాదంతో  చిక్కుకుంది. అతను స్థాపించిన సంస్థ సుమారు 110 కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  అతనిపై కేసు నమోదు చేసింది.  

click me!