ఎలక్ట్రిక్ సూటర్స్ పై మొట్టమొదటిసారిగా బంపర్ ఆఫర్.. ఫెస్టివల్ డిస్కౌంట్ వివరాలను తెలుసుకోండి..

By asianet news telugu  |  First Published Sep 27, 2022, 10:55 AM IST

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ పండుగ సీజన్‌లో కస్టమర్‌లను ఆకర్షించడానికి అలాగే సేల్స్ పెంచడానికి S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తగ్గింపు ధరతో అందిస్తున్నట్లు ప్రకటించింది. 


తమిళనాడుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తొలిసారిగా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది.  ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ పండుగ సీజన్‌లో కస్టమర్‌లను ఆకర్షించడానికి అలాగే సేల్స్ పెంచడానికి S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తగ్గింపు ధరతో అందిస్తున్నట్లు ప్రకటించింది. Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.40 లక్షలు. ఇప్పుడు దానిపై కంపెనీ రూ.10వేల తగ్గింపు ఇస్తోంది. ఫెస్టివల్ డిస్కౌంట్ కోసం షాపింగ్ విండో ఇప్పటికే ఓపెన్ అయింది.

ఓలా ఎలక్ట్రిక్ సోషల్ మీడియా ద్వారా ఈ ఫెస్టివల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓలా  ఫెస్టివల్ ఆఫర్‌ను ఉపయోగించుకోండి అలాగే Ola S1 ప్రోపై రూ.10,000 తగ్గింపు పొందండి. ఇతర ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా మీ కోసం వేచి ఉన్నాయి అంటూ పోస్ట్ చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 5 అంటే దసరా వరకు వర్తిస్తుంది. 

Latest Videos

undefined

ఓలా ఎలక్ట్రిక్ ఈ ఆఫర్ బెనెఫిట్స్ పొందడానికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఫెస్టివ్ ఆఫర్‌ ట్యాబ్‌పై క్లిక్ చేసిన తర్వాత S1 ప్రోని డిస్కౌంట్ రేటుతో కొనుగోలు చేయవచ్చు.  

Ola S1 ప్రో 180 కి.మీల కంటే ఎక్కువ ARAI సర్టిఫైడ్ రేంజ్‌తో వస్తుంది. S1 ప్రో  టాప్ స్పీడ్ 116 kmph, కేవలం మూడు సెకన్లలో 0 నుండి 40 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. 

Ola S1 Pro 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో  వస్తుంది, ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.  

click me!