ఇలాంటి కదిలే మ్యారేజ్ హాల్ ఎక్కడైనా చూసారా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

By asianet news telugu  |  First Published Sep 26, 2022, 2:48 PM IST

సోషల్ మీడియాలో ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఈ మ్యారేజ్ హాల్ బిల్డర్‌ను కలవాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.


బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తరచుగా ఆక్టివ్ గా ఉంటారు, ఇంకా వాటిపై చర్చలు కూడా చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్  లో ఒక ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేసారు, ఈ వీడియో ప్రజలను ఎంతో ఆలోచింపజేసేల చేస్తుంది. అదేంటంటే కదులుతున్న మ్యారేజ్ హాల్  వీడియో. 

సోషల్ మీడియాలో ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఈ మ్యారేజ్ హాల్ బిల్డర్‌ను కలవాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

Latest Videos

undefined

ఆయన షేర్ చేసిన వీడియో చూస్తుంటే అదో ఆడ్వటైజింగ్ ల అనిపిస్తోంది. కానీ వీడియో వివాహ వేడుకకు సంబంధించిన చిన్న హాల్ ల చూపిస్తుంది. ఈ మ్యారేజ్ హాల్  మొత్తం ఒక ట్రక్ లోపల నిర్మించారు. విశేషమేమిటంటే ఈ మ్యారేజ్ హాల్ లోకి రెండు వందల మంది హాయిగా రావచ్చు. దీని లోపల AC ఇంకా అద్భుతమైన లైట్లు కూడా ఉన్నాయి.  ఈ ట్రక్  40x30 చదరపు అడుగుల పోర్టబుల్ హాల్‌గా మారుతుంది. మ్యారేజ్ హాల్ లో స్టైలిష్ ఫర్నీచర్ సహా 200 మంది కూర్చునే అవకాశం ఉందని వీడియోలో పేర్కొంది.

 బిలియనీర్ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను చూసి ఎంతో ప్రశంసించారు. వీడియోకు సంబంధించి దీని వెనుక క్రియేటివిటీ మనస్సు ఉన్న వ్యక్తిని నేను కలవాలనుకుంటున్నాను. ఈ ఉత్పత్తి మారుమూల ప్రాంతాలను సులభతరం చేయడమే కాకుండా, పర్యావరణానికి కూడా మంచిది. ఈ ఉత్పత్తి ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. ఇంకా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. 

నెటిజన్లు కూడా ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ప్రశంసించారు ఇంకా ట్విట్టర్‌లో వారి క్రియేటివిటీ ప్రయత్నాలను గుర్తించినందుకు ఆనంద్ మహీంద్రాకు థాంక్స్ తెలిపారు.

 

I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810

— anand mahindra (@anandmahindra)
click me!