దసరాకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ కోనాలనుకుంటున్నారా.. వీటిపై ఒక లుక్కేయండి..?

By asianet news telugu  |  First Published Sep 22, 2022, 12:47 PM IST

టాప్ స్పీడ్ 45 kmph వేగంతో  సింగిల్ ఛార్జ్ చేస్తే 82 కి.మీల పరిధిని అందిస్తుంది. ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటలు సమయం పడుతుంది.


నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి, మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇంటికి తీసుకురావాలని  ఆలోచిస్తే  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మీకోసం.. ఇవి మంచి బ్యాటరీ రేంజ్ ఇంకా బడ్జెట్‌ ధరలో వస్తున్నాయి. ధర కూడా ఎక్కువ కాదు ఇంకా రూ.60 వేల నుండి ప్రారంభమవుతాయి.

ఆప్టిమా సి‌ఎక్స్ సింగిల్ బ్యాటరీ
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆప్టిమా సి‌ఎక్స్. రూ.62 వేల ఎక్స్-షోరూమ్ ధరతో వస్తున్న ఈ స్కూటర్ సింగిల్ బ్యాటరీ పొందుతుంది. టాప్ స్పీడ్ 45 kmph వేగంతో  సింగిల్ ఛార్జ్ చేస్తే 82 కి.మీల పరిధిని అందిస్తుంది. ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటలు సమయం పడుతుంది. అల్లాయ్ వీల్స్, పోర్టబుల్ బ్యాటరీ, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, రిమోట్ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం ఇంకా యూఎస్‌బీ పోర్ట్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. ఈ స్కూటర్ గ్రే, బ్లూ ఇంకా వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

Latest Videos

undefined

ఆప్టిమా సి‌ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ
ఈ స్కూటర్ ఆప్టిమా సిరీస్‌లోని రెండవ స్కూటర్, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.77,490. ఈ స్కూటర్‌లో డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ ఉంది, ఇంకా ఎక్కువ పరిధిని పెంచుతుంది. కంపెనీ ప్రకారం, ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ, టాప్ స్పీడ్ 45 kmph,  ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, రిమోట్ లాక్, అల్లాయ్ వీల్స్, పోర్టబుల్ బ్యాటరీ, యాంటీ థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్‌లో ఉన్నాయి. ఈ స్కూటర్ గ్రే, బ్లూ అండ్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.

ఫోటాన్ ఎలక్ట్రిక్ 
కంపెనీ  మూడవ స్కూటర్ ఫోటాన్. రూ.80,790 ఎక్స్ షోరూమ్ ధరతో వస్తున్న ఈ స్కూటర్ 108 కి.మీ, టాప్ స్పీడ్ 45 kmph, ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. పోర్టబుల్ బ్యాటరీ, అల్లాయ్ వీల్స్, రిమోట్ లాక్ అండ్ యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లతో ఫోటాన్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఎన్‌వై‌ఎక్స్ 
హీరో ఎన్‌వైఎక్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 82 కి.మీ వరకు నడపవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 42 కి.మీ. దీని బ్యాటరీని నాలుగు నుండి ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్, ఇన్-డాష్ బాటిల్ హోల్డర్, USB పోర్ట్, అల్లాయ్ వీల్, పోర్టబుల్ బ్యాటరీ, LED హెడ్‌ల్యాంప్ ఇచ్చారు.

అట్రియా అండ్ ఎడ్డీ
ఇవి కాకుండా కంపెనీకి చెందిన మరిన్ని మోడళ్లలో అట్రియా అండ్ ఎడ్డీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ మాత్రమే, వాటి పరిధి కూడా 85 కి.మీ. వీటిని ఛార్జ్ చేయడానికి కూడా నాలుగైదు గంటలు పడుతుంది.
 

click me!