ఫెరారీ పవర్ ఫుల్ స్పోర్ట్స్ కార్ కొన్న ప్రముఖ హీరో.. సెకండ్ కి ఈ కార్ స్పీడ్ ఎంతంటే..?

By asianet news telugu  |  First Published Nov 29, 2022, 4:30 PM IST

రామ్ కపూర్ టీవీ ఇండస్ట్రిలో ఎంతో ప్రజాదరణ పొందిన యాక్టర్, హిందీ టెలివిజన్ సీరియల్ 'బడే అచ్ఛే లాగ్తే హై', 'కసమ్ సే' వంటి ఎన్నో సీరియల్స్‌లో  నటించి పేరుగాంచాడు. 


ప్రముఖ టెలివిజన్ అండ్ బాలీవుడ్ హీరో రామ్ కపూర్ అతని నటి భార్య గౌతమి కపూర్ అద్భుతమైన కొత్త ఫెరారీ పోర్టోఫినో ఎమ్ స్పోర్ట్స్ కారును కొన్నారు. ఈ కొత్త ఫెరారీ పోర్టోఫినో ఎమ్ స్పోర్ట్స్ కారు ధర రూ.3.5 కోట్లు. 49 ఏళ్ల రామ్ కపూర్ విలాసవంతమైన కారుతో కనిపించడం ఇదేం మొదటిసారి కాదు, ఎందుకంటే కపూర్ హీరోగా ఇంకా కారు లవర్ కూడా..

రామ్ కపూర్ టీవీ ఇండస్ట్రిలో ఎంతో ప్రజాదరణ పొందిన యాక్టర్, హిందీ టెలివిజన్ సీరియల్ 'బడే అచ్ఛే లాగ్తే హై', 'కసమ్ సే' వంటి ఎన్నో సీరియల్స్‌లో  నటించి పేరుగాంచాడు. లగ్జరీ బ్రాండ్‌గా ఫెరారీ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా సెలబ్రిటీలు అత్యంత ఇష్టపడే కార్లలో ఒకటి. 

Latest Videos

undefined

రామ్ కపూర్ కొత్త ఫెరారీ పోర్టోఫినో ఎమ్ కారు రోస్సో కోర్సా కలర్ లో  నివేదిక ప్రకారం, అన్ని ఆప్షనల్ ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఇందులో చేర్చబడ్డాయి. స్పోర్ట్స్‌కార్ ఖరీదైన అల్కాంటారా కుయోయో ఇంటీరియర్ అండ్ కన్వర్టిబుల్ హార్డ్ రూఫ్ టాప్‌  కూడా పొందుతుంది. లాంచ్ సమయంలో Portofino M  ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.5 కోట్లు.  రామ్ కపూర్ దాదాపు అన్ని ఆప్షనల్ ఎక్స్‌ట్రాలు సెలెక్ట్ చేసుకున్నందున సూపర్‌కార్  కి ఖచ్చితంగా చాలా ఖర్చవుతుంది. 

ఇంజిన్ పవర్ అండ్ స్పీడ్
ఫెరారీ పోర్టోఫినో M స్పోర్ట్స్ కారు 3.9-లీటర్ టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజన్ 604 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.45 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదని కంపెనీ పేర్కొంది. 

 ప్రత్యేకత ఏమిటంటే
ఈ ఇటాలియన్ సూపర్‌కార్ పోర్టోఫినో ఎమ్‌లోని M అంటే 'మోడిఫికేషన్' అని సూచిస్తుంది, ఇంకా పోర్టోఫినో  స్టాండర్డ్ మోడల్ కంటే కారు ఎన్నో అదనపు ఫీచర్లను పొందుతుందని తెలుపుతుంది. 8-స్పీడ్ గేర్ యూనిట్‌తో  కొత్త డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్, వేరియబుల్ బూస్ట్ మేనేజ్‌మెంట్, ఫెరారీ అభివృద్ధి చేసిన కంట్రోల్ సాఫ్ట్‌వేర్, ఇంకా గేర్‌కు అనుగుణంగా టార్క్ డెలివరీని అడ్జస్ట్ చేస్తుంది. 

ADAS ఫీచర్లు
ఈ కార్ ఎన్నో కొత్త అండ్ ఆసక్తికరమైన ఫీచర్లతో కూడిన గ్రాండ్ టూరింగ్ స్పోర్ట్స్ కార్. ఫెరారీ ఫుల్ ఫై పొజిషన్ మానెటినో డయల్‌ను కూడా అందిస్తోంది. ఇది సాధారణంగా ఖరీదైన మోడళ్లలో కనిపించే విషయం. సాధారణ Portofino త్రీ-మోడ్ వెర్షన్ ద్వారా భర్తీ చేయబడింది. అంతేకాకుండా, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు కూడా కారులో  ఉన్నాయి. 

కార్ అండ్ బైక్ కలెక్షన్
రామ్ కపూర్ కార్ కలెక్షన్ గురించి మాట్లాడితే అతని వద్ద పోర్షే 911 కారెరా S, మెర్సిడెస్-AMG G63, BMW X5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కపూర్‌కు లగ్జరీ కార్లంటేనే కాదు ప్రీమియం బైక్స్ అంటే కూడా పిచ్చి. అతని బైక్ కలెక్షన్లో BMW R 18, ఇండియన్ రోడ్‌మాస్టర్ డార్క్ హార్స్, BMW K 1600 Bవంటి కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి.

click me!