మీరు మీ ఎలక్ట్రిక్ కారుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటున్నారా... ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి

By asianet news telugu  |  First Published Nov 29, 2022, 12:13 PM IST

మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకుంటే, మీ EV మైలేజ్ బట్టి, ప్రయాణం మధ్యలో కొన్ని స్టాప్‌లను ప్లాన్ చేయండి. ఫుల్ ఛార్జింగ్‌తో ప్రయాణం చేసేలా చూసుకోండి. అలాగే ఛార్జింగ్ స్టేషన్‌  మీరు ప్రయాణించే మొత్తం రూట్‌లో ఉండేలా ముందుగానే చూసుకోండి.


మీరు కూడా మీ ఎలక్ట్రిక్ కార్ తో ఎక్కువ దూరం ప్రయాణించాలని ఆలోచిస్తున్నారా?  ఎలక్ట్రిక్ కార్ కొన్నా లేదా కొనాలని సిద్ధమవుతున్న అందరిలాగే   మీరు కూడా  మైలేజ్ గురించి కొంత ఆందోళన చెందుతుంటారు.  అయితే కొన్ని సాధారణ టిప్స్ అండ్ ట్రిక్స్ సహాయంతో మీరు మీ ఎలక్ట్రిక్ కార్ మైలేజ్ తో అత్యధిక ప్రయోజనాలను పొందడమే కాకుండా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. 

మొదటి విషయం ఏమిటంటే మీ ఎలక్ట్రిక్ కార్ గురించి బాగా తెలుసుకోవడం. కార్ కి అందించిన మాన్యువల్, సూచనలను పూర్తిగా చదవండి. వాహన తయారీ సంస్థ  వెబ్‌సైట్‌లో కూడా చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుంది. మీ ఎలక్ట్రిక్ కార్ పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుంది  అనేది మీరు తెలుసుకోవాలి. అలాగే, మీ EVని ఛార్జ్ చేయడానికి ఎలాంటి సాకెట్ అవసరమో కూడా  తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్న తర్వాత దాని ఛార్జింగ్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మీరు మీ EVతో ఎక్కువ దూరం ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లయితే ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి...

Latest Videos

undefined

మీ ప్రయాణాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి
మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయాలనుకుంటే, మీ EV మైలేజ్ బట్టి, ప్రయాణం మధ్యలో కొన్ని స్టాప్‌లను ప్లాన్ చేయండి. ఫుల్ ఛార్జింగ్‌తో ప్రయాణం చేసేలా చూసుకోండి. మీరు ఒక రోజు కంటే ఎక్కువ రోజులు ట్రిప్ ప్లాన్ చేస్తే చార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మీరు ఉండే  హోటళ్లను చెక్ చేయవచ్చు. ఈ సౌకర్యం ఉన్న హోటల్‌ను సెలెక్ట్ చేసుకోండీ

ఛార్జింగ్ కోసం కొన్ని స్టాప్‌పేజ్‌లు
 ఛార్జింగ్ స్టేషన్‌  మీరు ప్రయాణించే మొత్తం రూట్‌లో ఉండేలా ముందుగానే చూసుకోండి. ఛార్జింగ్ స్టేషన్‌లో ఆహారం, పానీయాలు ఉండే చోట ఆగండి. ఎందుకంటే అదనపు సమయం తీసుకోకుండా మీ కార్ ని ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రభుత్వ ఇ-అమృత్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఛార్జింగ్ లొకేటర్ సహాయంతో ఛార్జింగ్ స్టేషన్‌ల గురించి సమాచారాన్ని పొందవచ్చు. 

స్మార్ట్ డ్రైవ్ 
మీరు EV డ్రైవింగ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీ EV పరిధిని సమర్థవంతంగా పెంచుకోవచ్చు . EV  స్పీడ్ పదే పదే పెంచవద్దు లేదా తగ్గించవద్దు, ఎందుకంటే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అస్థిరమైన వేగంతో పోలిస్తే 70 నుండి 80 kmph సాధారణ వేగంతో నడిపినప్పుడు మెరుగైన రేంజ్‌ని అందిస్తుంది. సడన్ బ్రేకింగ్ బ్యాటరీపై ఒత్తిడిని కలిగిస్తుంది. రోడ్డు పై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే, మీరు సడన్ బ్రేక్ చేయనవసరం లేకుండా సాధారణ స్పీడ్ తో గంటకు 40 లేదా 50 కి.మీ ప్రయనించండి. ఎక్కడైనా ఆగిపోవాలనుకుంటే కొద్ది దూరం నుంచే స్పీడ్ తగ్గించడం మొదలుపెట్టండి. అక్కడికి చేరుకున్న తర్వాత సడన్ బ్రేకింగ్‌ వేయకండి. 

పోర్టబుల్ ఛార్జర్
అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మీ వాహనానికి అనుగుణంగా పోర్టబుల్ ఛార్జర్‌ని తీసుకెళ్లడం కూడా మంచి ఆలోచన. పోర్టబుల్ ఛార్జర్‌తో, మీరు మీ EVని ఎప్పుడైనా, ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు.  

ఇతర వాహనాల లాగానే లగేజీలను తేలికగా ఉంచాలి, దూర ప్రయాణాలకు EVలు తేలికగా ఉంచాలి. చాలా ఎక్కువ లగేజీలు, బరువైన బ్యాగులను తీసుకెళ్లడం వల్ల EVల మైలేజ్ తగ్గుతుంది. అధిక బరువు బ్యాటరీపై ఒత్తిడి తెస్తుంది ఇంకా ఛార్జింగ్ త్వరగా అయిపోవచ్చు.

click me!