స్పీడ్‌లో రికార్డు:1.69 సెకన్లలో 100 కిమీ వేగం.. ధరెంతంటే

By Sandra Ashok KumarFirst Published Nov 18, 2019, 2:02 PM IST
Highlights

జపాన్‌కు చెందిన యస్పార్క్ ఓల్ సంస్థ విపణిలోకి అత్యంత వేగంగా దూసుకెళ్లే పొట్టి విద్యుత్ కారును ఆవిష్కరించింది. ఇది కేవలం 1.69 సెకన్లలోనే 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. దీని ధర రూ.22.85 కోట్లు మాత్రమే.. కేవలం 50 కార్లు మాత్రమే ఉత్పత్తి చేసిందీ సంస్థ.

దుబాయి: స్పీడ్​గా వెళ్తూ ఉంటే థ్రిల్‌గా ఉంటుంది. కానీ ఆ వేగం అందరినీ కిల్ చేస్తుంది. అయితే, ఆ స్పీడంటేనే నేటి కుర్రకారుకు జోరు. ప్రపంచంలోని లగ్జరీ కార్లు, బైకుల కంపెనీలు ఫీచర్లతో పాటు స్పీడ్​నూ ముఖ్యమైన పారామీటర్​గా తీసుకుంటాయి. 

also read  బ్రేకింగ్ సిస్టంలో లోపం : 4 లక్షల వాహనాల రికాల్

ఇన్ని సెకన్లలో ఇంత స్పీడ్​ అందుకుంటదంటూ యాక్సిలరేషన్​పై ప్రచారం చేస్తుంటాయి. మరి, ప్రపంచంలోని అత్యంత ఫాస్టెస్ట్​ యాక్సిలరేషన్​ కారేంటి? అంటే తమదే అంటోంది జపాన్​కు చెందిన యాస్పార్క్​ అనే కంపెనీ. ఆ కారుపేరు యాస్పార్క్​ ఓల్​. ఈ కారు జస్ట్​ 1.69 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని దుకుంటుందట. పూర్తి ఎలక్ట్రిక్​ కారు ఇది. 

ఇప్పటిదాకా రిమాక్​ అనే కంపెనీకి చెందిన కాన్సెప్ట్​ టూ, టెస్లా రోడ్​స్టర్​లు అత్యంత వేగవంతమైన యాక్సిలరేషన్​ ఉన్న కార్లుగా ప్రకటించుకున్నాయి. ఆ కార్లు వరుసగా 1.85 సెకన్లు, 1.9 సెకన్లలో వంద మార్కును అందుకుంటాయని తెలిపాయి.

also read వడివడిగా విస్తరణ : 300 పాయింట్లకు పైగా నెట్‌వర్క్ ఏర్పాటుకు కియా రెడీ

ఇప్పుడు ఆ రెండింటిని ఓల్​ దాటేసింది. నిజానికి 2017లోనే దాని ప్రొటోటైప్​ను తయారు చేసింది యాస్పార్క్​. ఇప్పుడు దుబాయ్​లో జరుగుతున్న వరల్డ్​ ప్రీమియర్​ కార్​ షోలో ప్రదర్శించింది. మొత్తంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఓల్​ దూసుకుపోతుందని యాస్పార్క్​ ప్రకటించింది.

ఈ కారుకు ఇంకో ప్రత్యేకతా ఉంది. ప్రపంచంలో అత్యంత పొట్టి కారు కూడా ఇదే. అవును, జస్ట్​ మూడు అడుగుల ఎత్తు (99 సెంటీమీటర్లు) మాత్రమే ఉంటుంది. అంతేగాక 120 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీంతో తక్కువ బరువు ఉన్న కారుగా  అది రికార్డు కొట్టేస్తుందట. కంపెనీ కేవలం 50 కార్లనే తయారు చేసింది.కారు ధర కూడా అదే రేంజ్​లో ఉంది. దాదాపు రూ.22 కోట్ల 85 లక్షలు. అంటే 31 లక్షల 90 వేల డాలర్లు.

click me!