కాస్ట్ కాన్‌స్ట్రయింట్ ప్రధాన సవాల్.. విద్యుత్ వెహికల్స్ సేల్స్‌పై మారుతి

By rajesh yFirst Published Sep 2, 2019, 11:52 AM IST
Highlights


ఇప్పటికిప్పుడు విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాలంటే అత్యధికంగా ఉన్న వాటి ధరలే కారణమని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ రామన్ తెలిపారు. చార్జింగ్ సమయం కం వసతి, పార్కింగ్ తదితర సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది విద్యుత్ వాహనాలను విపణిలోకి విడుదల చేయాలని దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కానీ దేశీయంగా విద్యుత్ చార్జింగ్ మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యగా మారింది. 

అందువల్లే అత్యధిక ధర పెట్టి భారతీయులు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ తెలిపారు. ధరలు తగ్గే వరకు భారతీయులు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం కష్టమేనన్నారు. 

వచ్చే ఏడాది విపణిలోకి విద్యుత్ వాహనాలను తెచ్చే విషయమై పరీక్షలు నిర్వహిస్తున్నామని సీవీ రామన్ చెప్పారు. వాహనాల శ్రేణి, టెంపరేచర్, చార్జింగ్ సమయం తదితర అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే ధర, చార్జింగ్ మౌలిక వసతులతోపాటు వినియోగదారుల ఆమోదం లభించడం అనేది విద్యుత్ వాహనాల విక్రయానికి ప్రదానం కానున్నది. 

వాగన్ఆర్ మోడల్ కారుపై జపాన్‌లో మారుతి సుజుకి 50 ప్రొటోటైప్ ఈవీలను పరీక్షించింది. సంప్రదాయ కారుతో పోలిస్తే విద్యుత్ వినియోగ కారు ధర రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నదని సీవీ రామన్ తెలిపారు. మారుతి సుజుకి అధ్యయనం ప్రకారం 60 శాతం మంది ప్రజలు సొంత పార్కింగ్ వసతి లేనందున చార్జింగ్ వసతులు కల్పించుకునే మార్గాల్లేవు. కనుక వారంతా విద్యుత్ వాహనాల వైపు ఇప్పటికిప్పుడు మళ్లే అవకాశాల్లేవని సీవీ రామన్ చెప్పారు. 

‘బ్యాటరీ కెమెస్ట్రీ, టెక్నాలజీలో మార్పులు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్ ద్రుక్కోణంలో ఈ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి’ అని సీవీ రామన్ వివరించారు. విద్యుత్ వాహనాల వినియోగించాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతుకు సమ్మతి తెలియజేస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. కానీ ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కాదని సీవీ రామన్ వివరించారు. 

click me!