చైనీస్ కంపెనీ స్ట్రీట్‌ఫైటర్ బైక్.. కే‌టి‌ఎం, బి‌ఎం‌డబల్యూ బైక్స్ కి పోటీగా ఇండియాలో లాంచ్..

By asianet news teluguFirst Published Oct 6, 2022, 3:19 PM IST
Highlights

లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే Zontes 350R అంగులర్ హెడ్‌ల్యాంప్‌ పొందుతుంది. ఎక్స్టెంటెడ్ ట్యాంక్ ష్రౌడ్, స్లాష్-కట్ ఎగ్జాస్ట్, స్టెప్-అప్ స్టైల్ సీటుతో కూడిన మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌ ఇచ్చారు. 

చైనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జోంటెస్ 350R స్ట్రీట్‌ఫైటర్ బైక్ ని ఇండియాలో లాంచ్ చేసింది. బైక్ ధర కలర్ పై ఆధారపడి ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్ ధర రూ. 3.37 లక్షల వరకు ఉంటుంది. జోంటెస్ 350ఆర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర  రూ. 3.15 లక్షలు అని కంపెనీ తెలిపింది. అయితే భవిష్యత్తులో ఈ బైక్ ధర పెరగవచ్చు.  

లుక్ అండ్ డిజైన్ 
లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే Zontes 350R అంగులర్ హెడ్‌ల్యాంప్‌ పొందుతుంది. ఎక్స్టెంటెడ్ ట్యాంక్ ష్రౌడ్, స్లాష్-కట్ ఎగ్జాస్ట్, స్టెప్-అప్ స్టైల్ సీటుతో కూడిన మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌ ఇచ్చారు. బైక్ ఆల్-LED లైటింగ్, స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ కనెక్టివిటీతో 5.0-అంగుళాల ఎల్‌సి‌డి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ కంట్రోల్స్, డ్యూయల్ ఫాస్ట్ ఛార్జింగ్ USB, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్  ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు.

ఇంజిన్ అండ్ పవర్
జోంటెస్ 350R బైక్ 348 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజన్ 9,500 rpm వద్ద 37.4 bhp శక్తిని, 7,500 rpm వద్ద 32 Nm గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. అంతేకాకుండా బైక్‌లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. 

సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్
బైక్ సస్పెన్షన్ కోసం 43 mm USD ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుక వైపున మోనోషాక్‌ పొందుతుంది. బ్రేకింగ్ ముందువైపు 320 mm డిస్క్‌, వెనుకవైపు స్టాండర్డ్ 265 SS రోటర్‌తో డ్యూయల్ ఛానెల్ ABS, బైక్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఇచ్చారు.

ఇండియాలో సేల్స్ 
హైదరాబాద్‌కు చెందిన మహావీర్ గ్రూప్ అనుబంధ సంస్థ అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఈ బైక్లలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త మోటో వాల్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్స్ విక్రయించనున్నారు. 


Zontes 350 బైక్ ధర :
 
రంగు వేరియంట్    ధర (రూ.)
జోన్టెస్ 350R బ్లూ     3,15,000
జోన్టెస్ 350R బ్లాక్     3,25,000
జోన్టెస్ 350R వైట్    3,25,000
జోన్టెస్ 350X బ్లాక్ అండ్ గోల్డ్        3,35,000
జోన్టెస్ 350X సిల్వర్ అండ్ ఆరెంజ్    3,45,000
జోన్టెస్ 350X బ్లాక్ అండ్ గ్రీన్        3,45,000
జోన్టెస్ GK350 బ్లాక్ అండ్ బ్లూ      3,37,000

కాంబాట్
జోన్టెస్ 350R అనేది బ్రాండ్ నుండి ఎంట్రీ-లెవల్ ఆఫర్.  Zontes 350R ఈ విభాగంలో ఇండియాలో KTM 390 డ్యూక్, BMW G 310 R బైక్స్ తో పోటీగా ఉంటుంది. 

click me!