మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి వెళ్లినప్పుడల్ల కారును నిశితంగా పరిశీలించండి. మీరు కారును జాగ్రత్తగా పరిశీలిస్తే కారులోని లోపాల గురించి మీకు తెలుస్తుంది.
సెకండ్ హ్యాండ్ కార్ కొనడం ఇప్పుడు ఈజీగా మారింది. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్, మార్కెట్లో తక్కువ ధర కారణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనేముందు కొన్ని విషయాలు మర్చిపోవడం వల్ల మీకు నష్టం కలగవచ్చు.
కారును జాగ్రత్తగా చూడండి
మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి వెళ్లినప్పుడల్ల కారును నిశితంగా పరిశీలించండి. మీరు కారును జాగ్రత్తగా పరిశీలిస్తే కారులోని లోపాల గురించి మీకు తెలుస్తుంది. దీనితో పాటు మీరు కారు కొనుగోలు చేసిన తర్వాత మీరు ఎంత ఖర్చు చేయవలసి ఉంటుంది అనే దాని గురించి కూడా తెలుస్తుంది.
రిజిస్ట్రేషన్ చెక్ చేయండి
కారు కొనడానికి ముందు కారు నంబర్ తీసుకొని వివరాలను చెక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు కారు ఓనర్, ఇతర సమాచారాన్ని పొందువచ్చు. మీకు కారును అమ్మే వ్యక్తి మీకు కారు గురించి సరైన సమాచారం ఇస్తున్నాడా లేదా అనే విషయాన్ని తెలుస్తుంది. దీనితో పాటు కారుపై ఏదైనా చలాన్లు, పన్ను బకాయి ఉందా లేదా అనే దాని గురించి కూడా మీకు సమాచారం లభిస్తుంది.
కంపెనీ నుండి రికార్డు
కారును దగ్గరలోని సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. అక్కడికి వెళ్లి కంపెనీ సర్వీస్ సెంటర్ నుండి కార్ సమాచారాన్ని తీసుకోండి. ఇలా చేయడం ద్వారా కారు సమయానికి సర్వీస్ చేయబడిందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. కారులో ఏదైనా పార్ట్ ఎప్పుడైనా రీప్లేస్ చేయబడిందా లేదా మార్చబడి ఉంటే దాని గురించి మీకు తెలుస్తుంది.
ఇన్సూరన్స్ చెక్ చేయండి
కారు పేపర్లను చూస్తున్నప్పుడు, మీరు తప్పనిసరిగా ఇన్సూరన్స్ చెక్ చేయాలి. కారు ఎప్పుడైనా ఇన్సూరన్స్ క్లెయిమ్ చేయబడిందా లేదా అనేది ఇందులో మీకు తెలుస్తుంది. దీనితో పాటు కారు వాల్యు గురించి కూడా మీకు సమాచారం లభిస్తుంది.