మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీ చేతిలో డబ్బులు లేవా? ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీకోసం బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి.
మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీ చేతిలో డబ్బులు లేవా? ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీకోసం బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి. ఎస్‌బీఐ దగ్గరి నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే కారు కొనుగోలుకు రుణాలు ఆఫర్ చేస్తున్నాయి.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కారు కొనేందుకు రుణాలు అందిస్తోంది. 21 నుంచి 67 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం కనీసం రూ.3 లక్షలు కలిగిన వారు లోన్ పొందొచ్చు. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
undefined
ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా కూడా కార్ లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. మీరు ఎంచుకునే లోన్ టెన్యూర్, రుణ మొత్తం ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారొచ్చు. అలాగే సిబిల్ స్కోర్ కూడా వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి కాస్త తక్కువ రేటుకు రుణాలు లభించే అవకాశం ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. కారు ధరలో 90 శాతం వరకు ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తోంది. వడ్డీ రేటు 7 శాతం నుంచే ప్రారంభం అవుతోంది. అంటే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల కన్నా ఇందులోనే తక్కువ వడ్డీ రేటుకు కారు లోన్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కారు కొనేందుకు రుణం పొందాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తక్కువ వడ్డీకే రుణం ఇస్తున్న బ్యాంక్‌లో లోన్ కోసం అప్లై చేసుకోవడం ఉత్తమం. అలాగే బ్యాంక్ వసూలు చేస్తున్న చార్జీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అలాగే లోన్ క్లోజర్ చార్జీలు కూడా గమనించాలి. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే లోన్ కోసం అప్లై చేసుకోవాలి.