ఎంత జాగ్రత్తగా ఉన్న మీ వాహనానికి చలాన్లు పడుతూనే ఉన్నాయా?.. అయితే Google మ్యాప్స్ ఈ ఫీచర్‌ను తెలుసుకోండి..

By team teluguFirst Published Nov 30, 2021, 10:11 AM IST
Highlights

ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా.. కొన్ని సార్లు మీ వాహనాలకు చలాన్లు పడుతూనే ఉండటం గమనిస్తునే ఉంటారు. అయితే ఇలాంటి వాటికి చెక్ చెప్పడానికి Google మ్యాప్స్ ఈ కొత్త ఫీచర్‌ను తెలుసుకోండి..

ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా.. కొన్ని సార్లు మీ వాహనాలకు చలాన్లు పడుతూనే ఉండటం గమనిస్తునే ఉంటారు. మీ వాహనానికి చలాన్ పడినట్టుగా మొబైల్‌కు సందేశాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇందుకు కారణం.. సాంకేతికత పెరిగిపోవడంతో ఎప్పుడు రోడ్లపై అమర్చిన కెమెరాలు మిమ్మల్ని అనుసరిస్తూనే ఉంటాయి. ఏ సమయంలో కొద్దిపాటి మిస్టేక్ చేసినా వెంటనే.. మీకు చలాన్లు పంపించబడతాయి. ముఖ్యంగా హై స్పీడ్‌కు సంబంధించిన చలాన్లు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతూనే ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీలలో ఇటువంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

అయితే ఇటువంటి చలాన్లు వస్తున్న నేపథ్యంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి చలాన్లు పడకుండా మీ స్మార్ట్‌ఫోన్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుందనే సంగతి మీకు తెలుసా..?. ఎలాగంటే.. కాబట్టి ఓవర్ స్పీడ్‌ను నివారించడానికి.. మీరు Google మ్యాప్ సహాయంతో హైటెక్ పద్ధతిని కూడా అవలంబించవచ్చు. ఇది చలాన్లు పడటాన్ని తగ్గించడమే కాకుండా.. వేగం కారణంగా చోటుచేసుకునే ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. 

అదేమిటంటే..
Google Map.. స్పీడోమీటర్ ఫీచర్ వాహనం వేగాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. వాహనం వేగం నిర్దిష్ట పరిమితిని దాటిన వెంటనే స్పీడోమీటర్ ఫీచర్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. 

ఏం చేయాలంటే..?
స్పీడోమీటర్‌ని యాక్టివేట్ చేయడానికి.. ముందుగా Google మ్యాప్స్‌ని యాక్టివేట్ చేయండి. తర్వాత Google Map యొక్క ప్రొఫైల్‌పై క్లిక్ చేస్తే.. సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత.. అక్కడ కనిపించే నావిగేషన్ సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డ్రైవింగ్ ఆప్షన్ కింద స్పీడో మీటర్ అని ఉంటుంది. దానిని ఆన్ చేయాల్సి ఉంటుంది.

స్పీడోమీటర్ ఎలా పని చేస్తుంది?
మీరు Google Maps యొక్క స్పీడోమీటర్‌తో మీ కారు వేగాన్ని కూడా పరిశీలించవచ్చు. నిర్దిష్ట వేగ పరిమితిని మించిపోయినప్పుడు స్పీడోమీటర్ ఎరుపు రంగులోకి మారుతుంది. దీని సహాయంతో.. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కారు వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఇది మీ కారు ఏ వేగంతో వెళుతుందో మీకు తెలియజేస్తుంది. ఇలా చేయడం ద్వారా చలాన్‌ల బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా.. ప్రమాదాలను కూడా నివారించవచ్చు.
 

click me!