మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...ఫీచర్లు అదుర్స్!

By Sandra Ashok Kumar  |  First Published Dec 22, 2019, 11:46 AM IST

దాదాపు 12 నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన బెన్లింగ్ ఇండియా తాజాగా విపణిలోకి హై స్పీడ్ సెగ్మెంట్‌లో ‘ఔరా’ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో లబ్దిదారులకు అందుబాటులోకి రానున్నది.  


న్యూఢిల్లీ: బెన్లింగ్ ఇండియా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఔరా’ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి వినియోగదారులకు ఈ స్కూటర్ అందుబాటులోకి రానున్నది. ఈ ఏడాది మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన బెన్లింగ్ ఇండియా ఇప్పటికే మూడు తక్కువ స్పీడ్ కలిగిన మూడు మోడళ్లు.. కృతి, ఐకాన్, ఫాల్కన్‌లను విడుదల చేసింది. తాజాగా ‘ఔరా’ను తీసుకొచ్చిన బెన్లింగ్.. హైస్పీడ్ సెగ్మెంట్‌లో దీనిని విక్రయించనుంది.

also read ఆటో ఎక్స్‌పోకు డజనుకుపైగా కంపెనీలు డుమ్మా...కారణం ?
 
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో చాలా అవకాశాలు ఉన్నాయని బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో పరితోష్ దేవ్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చార్జింగ్ కోసం మౌలిక వసతులు లేవని అన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అవసరమని పేర్కొన్నారు. 

Latest Videos

undefined

భారతదేశంలో మౌలిక వసతులు ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల రంగం అద్భుత పురోగతి సాధిస్తుందని బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో పరితోష్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
 

also read ఇండియాలో..క్యూ కడుతున్న చైనా కార్ల కంపెనీలు...ఎందుకంటే ?


‘బెన్లింగ్ ఔరా’ స్కూటర్‌లో అందరినీ ఆకర్షించే ప్రత్యేకత ఒకటి ఉంది. అది బ్రేక్‌డౌన్ స్మార్ట్ అసిస్టెన్స్ సిస్టం (బీఎస్ఏఎస్). దీనివల్ల స్కూటర్ బ్రేక్ డౌన్ అయినా స్కూటర్ రీస్టార్ అవుతుందని కంపెనీ తెలిపింది. ‘బెన్లింగ్ ఔరా’లో 2500 బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటార్, డిటాచబుల్ 72v/40Ah లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.

దీనిని ఒకసారి చార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వస్తుంది. బ్యాటరీ నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. స్కూటర్ టాప్ స్పీడ్ 60 కిలోమీటర్లు. రిమోట్ కీలెస్ సిస్టం, యూఎస్‌బీ చార్జింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, అదనంగా రియర్ వీల్ ఇంటిగ్రేటెడ్ లాకింగ్ సిస్టం ఉన్నట్టు బెన్లింగ్ పేర్కొంది.

click me!