
హైదరాబాద్: ప్రీమియం బైక్స్ ప్లేయర్ బెనెల్లి ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా - మహావీర్ గ్రూప్ కలిసి తన రెండవ ప్రత్యేకమైన బెనెల్లి షోరూమ్‌ను హైదరాబాద్‌లో నాగోల్‌లో సోమవారం ప్రారంభించింది.ఇప్పుడు సిటీలో ఇటాలియన్ బ్రాండ్ బైకులు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.
also read మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు...ఓన్లీ రూ.52.56 లక్షలు
బెనెల్లి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ దబఖ్ మాట్లాడుతూ “హైదరాబాద్ లోని ఎల్బి నగర్ బెనెల్లి షోరూమ్ ఉద్యోగులు అమ్మకాలు, సర్వీస్, విడిభాగాలు మరియు కస్టమర్ సేవ పరంగా ఉత్తమమైన సహకారం అందించడానికి వీళ్ళు శిక్షణ కూడా పొందారు."
భారతదేశంలో గూంచా మోటార్స్ డీలర్ షిప్ బెనెల్లి అన్నీ మోడల్ సూపర్ బైక్‌లను అందిస్తున్నారు. వాటిలో బెనెల్లి ఇంపీరియల్ 400 (రూ. 1.69 లక్షలు), లియోన్సినో 250 (రూ .2.5 లక్షలు), టిఎన్‌టి 300 (రూ .2.99 లక్షలు), 302 ఆర్ (రూ. 3.1 లక్షలు), లియోన్సినో 500 (రూ. 4.79 లక్షలు), టిఆర్‌కె 502 (రూ. 5.1 లక్షలు), టిఆర్‌కె 502 ఎక్స్ (రూ .5.5 లక్షలు), టిఎన్‌టి 600 ఐ (రూ .6.2 లక్షలు).
also read మారుతి ‘ధరల’ బాంబు: వచ్చే ఏడాది నుంచి కార్లు మరింత భారం
ఎల్‌బీనగర్ బెనెల్లీ షో రూమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భర్వాణి మాట్లాడుతూ బెనెల్లీ కంపెనీకి చెందిన అన్ని మోడల్స్ బైకులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఇంపీరియల్ 400 బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు కనీసం 4వేల రూపాయల బుకింగ్ చార్జ్ చెల్లించి ఇంపీరియల్ 400 ను బుక్ చేసుకోవచ్చు. ఈ షోరూమ్ లో వీడి భాగాలు మరియు స్పేర్ పార్ట్లు కూడా లభ్యమవుతాయి. మోటారుసైకిల్ కస్టమైజేషన్‌ను దశలవారీగా భారత్‌లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.