యమాహాకి పోటీగా బజాజ్ పల్సర్ న్యూ జనరేషన్ బైక్.. స్టయిల్, లుక్ అదిరిపోయిందిగా...

By asianet news teluguFirst Published Nov 23, 2022, 12:29 PM IST
Highlights

బజాజ్ పల్సర్ P150ని మంగళవారం కోల్‌కతాలో ప్రారంభించారు, రానున్న రోజుల్లో ఇతర నగరాల్లో పరిచయం చేయబడుతుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో  5 కలర్స్ లో లభిస్తుంది

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో భారత మార్కెట్లోకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ బజాజ్ పల్సర్ 150ని లాంచ్ చేసింది. దీనికి పల్సర్ పీ150 అని పేరు పెట్టారు. దీని సింగిల్-డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.16 లక్షల నుండి ప్రారంభమవుతుంది, అయితే ట్విన్-డిస్క్ వేరియంట్ ధర రూ. 1.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. P150 అనేది N250, F250, N160 తర్వాత కొత్త జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై వస్తున్న మూడవ పల్సర్.

కలర్ ఆప్షన్
బజాజ్ పల్సర్ P150ని మంగళవారం కోల్‌కతాలో ప్రారంభించారు, రానున్న రోజుల్లో ఇతర నగరాల్లో పరిచయం చేయబడుతుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో  5 కలర్స్ లో లభిస్తుంది - రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ అండ్ ఎబోనీ బ్లాక్ వైట్. 

బజాజ్ ఆటో నుండి ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన బైక్స్ లో పల్సర్ ఒకటి. మార్కెట్లోకి చాలా రకాల బైక్స్ వచ్చి చేరాయి, అయితే ఈ బైక్ ఇప్పటికీ  కస్టమర్లకు ఇష్టమైన బైక్‌లలో ఒకటి. డిస్కవర్ అండ్ XCD సిరీస్‌లు ఈ రేస్‌లో నిలదొక్కుకోలేకపోయినప్పటికీ కస్టమర్ల హృదయాల్లో స్థిరపడిన బ్రాండ్‌లలో పల్సర్ ఒకటి. 

పల్సర్ సిరీస్‌కు ఇండియాలోనే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో కూడా మంచి ఆదరణ ఉంది. పల్సర్ 125 అమ్మకాలు పల్సర్ 150 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, లాంచ్ అయినప్పటి నుండి  పల్సర్ 150 ఈ సిరీస్‌లో రారాజుగా పరిగణించబడుతుంది.  

కొత్త లుక్ అండ్ డిజైన్
బజాజ్ బైక్  అప్‌డేట్‌లో పల్సర్ 150 డిజైన్‌ను పూర్తిగా మార్చేసింది. కొత్త డిజైన్ లాంగ్వేజ్ పల్సర్ P150ని స్పోర్టియర్‌గా, స్పీడ్ అండ్ లైట్ గా చేస్తుంది. దీనికి కొత్త ఏరోడైనమిక్ 3D ఫ్రంట్ ఉంది ఇంకా డ్యూయల్ కలర్‌లో ఆకర్షణీయమైన అలాగే డైనమిక్ లుక్ ఇస్తుంది. ఈ బైక్  స్ప్లిట్ సీట్లతో వస్తుంది. 790 ఎం‌ఎం సీటు ఎత్తుతో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ క్లాసీ లుక్‌ని ఇస్తుంది.

సస్పెన్షన్
ఎగ్జాస్ట్ అనేది బజాజ్ N160లో ఉన్నటువంటి అండర్-బెల్లీ యూనిట్.  డిజైన్ మెరుగైన బ్యాలెన్స్ అండ్ హ్యాండ్లింగ్‌ ఇస్తుంది. ఇంకా ఈ బైక్ దాని కేటగిరీలో అత్యంత నడపగలిగే బైక్‌గా నిలిచింది. సస్పెన్షన్ కోసం, ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ యూనిట్లు అందించారు. ఈ ముఖ్యమైన అప్ డేట్స్ తో బైక్ బరువు 10 కిలోలు తగ్గింది (ట్విన్-డిస్క్ వేరియంట్ కోసం). అంటే పవర్-టు-వెయిట్ రేషియో 11 శాతం పెరిగింది. 

ఇంజిన్ అండ్ పవర్
కొత్త బజాజ్ పల్సర్ P150 న్యూ 149.68cc ఇంజన్‌ పొందింది. ఈ ఇంజన్ 8,500 rpm వద్ద 14.5 PS గరిష్ట శక్తిని, 6,000 rpm వద్ద 13.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  

ఫీచర్ల గురించి మాట్లాడితే గేర్ ఇండికేటర్, క్లాక్, ఫ్యూయల్ ఎకానమీ, DTE, LED టెయిల్ ల్యాంప్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో ఇన్ఫినిటీ డిస్‌ప్లే, మొబైల్ ఛార్జింగ్ కోసం USB సాకెట్ కూడా ఉంది. బైక్ సింగిల్-ఛానల్ ABS స్టాండర్డ్ గా పొందుతుంది.

click me!