వ్యాన్ సెగ్మెంట్‌లో వేలాది మంది కొనుగోలుదారులకు మారుతి ఈకో బెస్ట్ ఆప్షన్. ఇంకా బాక్సీ డిజైన్‌తో వస్తుంది, అంతేకాదు లోపల చాలా స్థలాన్ని కూడా అందిస్తుంది.
ఆటోమోబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త ఇంకా పవర్ ఫుల్ ఇంజన్, ఎక్కువ మైలేజీతో ఈకో వ్యాన్‌ను లాంచ్ చేసింది. మారుతి 2022 ఈకోలో పాత G12B పెట్రోల్ ఇంజన్‌కి బదులు కొత్త 1.2-లీటర్ K సిరీస్ ఇంజన్ అందించింది. కొత్త ఈకోలో CNG ఆప్షన్ కూడా ఇచ్చారు. 2022 మారుతి సుజుకి ఈకో ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 2022 మారుతి సుజుకి ఈకో 5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్ అండ్ అంబులెన్స్‌తో సహా 13 వేరియంట్‌లలో వస్తుంది.
వ్యాన్ సెగ్మెంట్‌లో వేలాది మంది కొనుగోలుదారులకు మారుతి ఈకో బెస్ట్ ఆప్షన్. ఇంకా బాక్సీ డిజైన్‌తో వస్తుంది, అంతేకాదు లోపల చాలా స్థలాన్ని కూడా అందిస్తుంది. దీని ఇంటీరియర్ కస్టమర్‌ల ప్రాథమిక అవసరాలను తీర్చగలవు. ఈ రకమైన ఏకైక Eeco భారతదేశంలోని టాప్ 10 కార్లలో ఎక్కువగా కనిపిస్తుంది.
undefined
మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ కొత్త Eeco లాంచ్ గురించి మాట్లాడుతూ "ఈకో ప్రారంభించినప్పటి నుండి 9.75 లక్షల మంది కస్టమర్లకు ఇష్టమైన, గర్వించదగిన ఆప్షన్ గా ఉంది.
ఎన్నో కుటుంబాలలో భాగమై లక్షలాది మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు జీవనోపాధిని కల్పిస్తూ కొత్త ఈకో నమ్మకమైన, సమర్థవంతమైన వాహనంగా కొనసాగుతుంది. ఇంకా సౌకర్యవంతమైన, స్టైలిష్, కుటుంబ వాహనంగా కస్టమర్ ప్రాధాన్యతలను అందిస్తుంది, ఇంకా వాణిజ్య ఉపయోగం కోసం సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.
ఎక్కువ పవర్ ఫుల్
2022 మారుతి ఈకోకి అత్యంత ముఖ్యమైన అప్ డేట్ 1.2-లీటర్ లేటెస్ట్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్. ఈ ఇంజన్ ఎక్కువ పవర్ ఫుల్ అండ్ అధిక మైలేజ్ తో 6000 rpm వద్ద 59.4 kW (80.76 PS) అంటే 10 శాతం ఎక్కువ శక్తిని, 3000 rpm వద్ద 104.4 Nm (పెట్రోల్ వేరియంట్ కోసం) టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మైలేజీ
కొత్త 2022 మారుతి ఈకో పెట్రోల్ వెర్షన్ 20.20 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. S-CNG వెర్షన్ 27.05 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
ఫీచర్లు
మారుతి సుజుకి ఈకో ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. ఈ వ్యాన్ కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, బ్యాటరీ సేవర్ ఫంక్షన్‌తో కూడిన డోమ్ ల్యాంప్స్, ఎయిర్ కండిషనింగ్ కోసం కొత్త రోటరీ కంట్రోల్స్ పొందుతుంది.
సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ ఫీచర్ల పరంగా ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, స్లైడింగ్ డోర్స్, డోర్స్ కి చైల్డ్ లాక్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి.
మారుతి సుజుకి న్యూ ఈకో ధరలు
మారుతి సుజుకి ఈకో బేస్ టూర్ V 5-సీటర్ స్టాండర్డ్ ధర రూ. 5,10,200 నుండి, ఎకో అంబులెన్స్ ధర రూ.8,13,200 నుండి, Eeco కార్గో CNG ధర రూ.6,23,200 నుండి ప్రారంభమవుతాయి. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ చెందినవి.
మారుతి ఈకో ఎక్స్-షోరూమ్ ధరలు
టూర్ V 5-సీటర్ ధర - 5,10,200
ఈకో 5-సీటర్ ధర - 5,13,200
ఈకో కార్గో ధర - 5,28,200
టూర్ V 7-సీటర్ ధర - 5,39,200
ఈకో 7-సీటర్ ధర - 5,42,200
టూర్ V 5-సీటర్ AC ధర - 5,46,200
Eeco 5-సీటర్ AC ధర - 5,49,200
ఈకో కార్గో CNG ధర - 6,23,200
ఈకో అంబులెన్స్ షెల్ ధర - 6,40,000
టూర్ V 5-సీటర్ AC CNG ధర – 6,41,200
Eeco 5-సీటర్ AC CNG ధర - 6,44,200
ఈకో ఛార్జ్ AC CNG ధర - 6,65,200
ఈకో అంబులెన్స్ ధర - 8,13,200