బెస్ట్ ఫీచర్లతో ఫోర్స్ కంపెనీ కొత్త వ్యాన్.. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రయాణించవచ్చు..

By asianet news telugu  |  First Published Nov 22, 2022, 9:11 PM IST

ఈ కొత్త వ్యాన్ ఫస్ట్ లుక్ ను ఫోర్స్ మోటార్స్ విడుదల చేసింది. ఇందులో వాన్ ఎక్ట్సీరియర్ అండ్ ఇంటీరియర్‌తో పాటు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ల గురించి సమాచారం కూడా ఇచ్చారు.


మీరు కూడా మీ పెద్ద ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారా.. అయితే రానున్న రోజుల్లో ఫోర్స్ మోటార్స్ కొత్త వ్యాన్‌ను పరిచయం చేయనుంది. ఈ వ్యాన్‌లో 17 మంది కలిసి ఒకేసారి ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాన్ మరెన్నో గొప్ప ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది.

ఫస్ట్ లుక్ 
ఈ కొత్త వ్యాన్ ఫస్ట్ లుక్ ను ఫోర్స్ మోటార్స్ విడుదల చేసింది. ఇందులో వాన్ ఎక్ట్సీరియర్ అండ్ ఇంటీరియర్‌తో పాటు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ల గురించి సమాచారం కూడా ఇచ్చారు. కంపెనీ ప్రకారం ఇందులో ఉండే ట్రావెలింగ్ అనుభవం ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు.

Latest Videos

undefined

ఇంజిన్
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, వ్యాన్‌లో పవర్ ఫుల్ ఇంజన్ ఇచ్చారు. ఈ వ్యాన్ మెర్సిడెస్  2.6 CR ED TCIC డీజిల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇంకా 115 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఫస్ట్ ఫీచర్లు
ఫోర్స్ అర్బేనియాలో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఇచ్చారు. ఇందులో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్‌పై గేర్ లివర్, 17.8 సెం.మీ LCD టచ్ స్క్రీన్, Apple Car Play అండ్ Android Auto సపోర్ట్, 6 అండ్ 8 స్పీకర్‌ల ఆప్షన్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, అల్ట్రాసోనిక్ సెన్సార్ బేస్ సిస్టమ్‌తో కూడిన కెమెరా, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, AC వెంట్స్, రిక్లైనింగ్ సీట్లు, పనోరమిక్ విండోస్, రీడింగ్ ల్యాంప్స్, USB పోర్ట్ వంటి ఫీచర్లు.

సేఫ్టీ
ఫోర్స్ కొత్త వ్యాన్‌లో కంపెనీ  సేఫ్టీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రోల్ ఓవర్ ప్రొటెక్షన్, హిల్ హోల్డ్ అసిస్ట్, హై సెక్యూరిటీ వెహికల్ ట్రాన్స్‌పాండర్ ఇంజిన్ ఇమ్మొబిలైజర్, మోనోకోక్ స్ట్రక్చర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్ ESP, ABS అండ్ EBD, పాదచారుల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ అందించింది.

మూడు వేరియంట్లలో
కొత్త వాన్ అర్బేనియాను కంపెనీ మూడు వేరియంట్లలో అందిస్తుంది. వీటిలో మొదటిది షార్ట్ వీల్‌బేస్, ఇందులో డ్రైవర్ కాకుండా పది మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీని తరువాత మీడియం వీల్‌బేస్‌లో డ్రైవర్‌తో కలిసి 13 మంది ప్రయాణికులు, లాంగ్ వీల్‌బేస్‌లో డ్రైవర్‌తో పాటు 17 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

click me!