భారతదేశపు చిపెస్ట్ 125cc బైక్.. షైన్, స్ప్లెండర్ కి పోటీగా లాంచ్.. వారికి పర్ఫెక్ట్..

By asianet news teluguFirst Published Aug 26, 2022, 12:56 PM IST
Highlights

బజాజ్ CT125X హాలోజన్ బల్బ్‌తో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది. LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ స్ట్రిప్‌తో హెడ్‌ల్యాంప్‌ను కవర్ చేసే చిన్న కౌల్ ఉంది. 

బజాజ్ ఆటో లిమిటెడ్  ఇండియాలో అత్యంత బడ్జెట్ 125cc బైజ్ ని లాంచ్ చేసింది.  బజాజ్ CT125X ఎక్స్-షోరూమ్ ధర రూ. 71,354 అంటే ప్రస్తుత CT110X కంటే రూ. 5056 ఎక్కువ. 125cc సెగ్మెంట్లో బెస్ట్ సెల్లర్ హోండా షైన్ కంటే రూ.6000 తక్కువ. బజాజ్ CT125X బైక్ మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లలో పరిచయం చేసారు. ఇందులో బ్లూ విత్ బ్లాక్, రెడ్ విత్ బ్లాక్, గ్రీన్ విత్ బ్లాక్ ఉన్నాయి. 

ఇంజన్ అండ్ పవర్
బజాజ్ CT125X బైక్ 124.4 cc, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌. బజాజ్ DTS-i టెక్నాలజీ అండ్ SOHC సెటప్‌ పొందుతుంది. ఈ ఇంజన్ 8,000 rpm వద్ద గరిష్టంగా 10.9 PS శక్తిని, 5,500 rpm వద్ద 11 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ ఇచ్చారు.

లుక్ అండ్ డిజైన్
బజాజ్ CT125X హాలోజన్ బల్బ్‌తో గుండ్రటి హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది. LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ స్ట్రిప్‌తో హెడ్‌ల్యాంప్‌ను కవర్ చేసే చిన్న కౌల్ ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై గ్రాఫిక్స్ ఇంకా ట్యాంక్ గ్రిప్‌లు, వెనుక భాగంలో ఒక గ్రాబ్ రేల్ ఉంది, ఇది లాగేజ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.

సింగిల్-పీస్ సీటు వెనుక ప్రయాణీకుడికి ఇంకా రైడర్‌కు తగినంత ప్లేస్ సరిపోతుంది. బైక్‌కు ఎక్కువ బాడీవర్క్ లేదు, ఇంకా నిత్యం ప్రయాణాలకి బైక్ ఉపయోగించే వారిని ఈ బైక్ స్పష్టంగా టార్గెట్ చేస్తుంది. 

ఈ బైక్ కఠినమైన భూభాగాలపై లేదా పెద్ద స్పీడ్ బ్రేకర్‌లపై నడిపేటప్పుడు ఇంజన్‌ను రక్షించడానికి బజాజ్ బెల్లీ పాన్‌ను కూడా అందిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రైడర్ మోకాళ్లను రక్షించేందుకు క్రాష్ గార్డ్స్ కూడా ఉన్నాయి. అవి బైక్ ని రక్షించడంలో కూడా సహాయపడతాయి.
 
బైక్ ట్యూబ్‌లెస్ టైర్లు, ఫోర్క్ గైటర్‌లు ఇంకా అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. సీటు TM ఫోమ్‌తో కూడిన క్విల్టెడ్ ప్యాటర్న్‌ను పొందుతుంది. ముందు టైర్ సైజ్ 80/100 అయితే బ్యాక్ టైర్ సైజ్ 100/90. రెండింటి సైజ్ 17-అంగుళాలు. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో బజాజ్ CT125X హీరో సూపర్ స్ప్లెండర్, హోండా షైన్ ఇంకా TVS రేడియన్‌లకు పోటీగా ఉంటుంది. 

click me!