ప్రస్తుతం ఈ కారు ఇండియాలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ మారింది. Mercedes-Benz AMG EQS 53 అనేది కంపెనీ పర్ఫర్మేన్స్ కార్లలో మొదటి ఎలక్ట్రిక్ కారు అలాగే గత సంవత్సరం ప్రపంచ మార్కెట్లలోకి దీనిని పరిచయం చేసారు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా బుధవారం ఏఎంజి ఈక్యూఎస్ 53 పర్ఫర్మేన్స్ ఎలక్ట్రిక్ కారుని అధికారికంగా లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త కార్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.2.45 కోట్లుగా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఈ కారు ఇండియాలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ మారింది. Mercedes-Benz AMG EQS 53 అనేది కంపెనీ పర్ఫర్మేన్స్ కార్లలో మొదటి ఎలక్ట్రిక్ కారు అలాగే గత సంవత్సరం ప్రపంచ మార్కెట్లలోకి దీనిని పరిచయం చేసారు. ఈ కార్ ఇప్పుడు EQC తర్వాత ఇండియాలో మెర్సిడెస్ రెండవ ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్.
లుక్ అండ్ డిజైన్
Mercedes-Benz AMG EQS 53 సిల్హౌట్ ఈ సంవత్సరం చివర్లో రానున్న EQS 580కి చాలా పోలి ఉంటుంది. ఈ మోడల్‌లో చాలా విషయాలు కనిపిస్తాయి, ఇంకా దాని స్టయిల్ లాంగ్వేజ్ వెల్లడిస్తుంది. ఫ్రంట్ బానెట్, AMG-బ్లాక్ ప్యానెల్ గ్రిల్‌పై వెర్టికల్ స్ట్రట్‌లు, గ్లోస్ ట్రిమ్‌తో హై గ్లోస్ బ్లాక్‌లో ఫ్రంట్ స్ప్లిటర్, 1.3 మిలియన్ పిక్సెల్స్‌తో డిజిటల్ LED హెడ్ లైట్లు, లో రోలింగ్ రెసిస్టెన్స్‌తో 21-అంగుళాల అల్లాయ్. విల్స్, టచ్‌తో బయటకు వచ్చే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 3డి హెలిక్స్ డిజైన్‌లో ఎల్‌ఈడీ ల్యాంప్స్‌తో ఫ్లష్ టెయిల్ గేట్, టెయిల్‌గేట్‌పై స్టార్ బ్యాడ్జ్ దీని అందాన్ని పెంచుతాయి.
undefined
Mercedes-Benz AMG EQS 53 సైజ్
డైమెన్షన్
పొడవు 5,223ఎంఎం
వెడల్పు 1,926ఎంఎం
ఎత్తు 1,515ఎంఎం
వీల్ బేస్ 3,210ఎంఎం
కార్గో స్పేస్ 610 లీటర్లు
క్యాబిన్ అండ్ ఫీచర్లు
Mercedes AMG EQS 53 క్యాబిన్ అతిపెద్ద హైలైట్ గొరిల్లా గ్లాస్‌తో కూడిన 56-అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్, 3D మ్యాప్‌లు, ఇన్-కార్ గేమింగ్ ఫంక్షనాలిటీ, కెమెరాల నుండి ఫీడ్ ఇంకా మరెన్నో ఏఐ ఫీచర్లతో వస్తుంది. AMG-నిర్దిష్ట స్టీరింగ్ వీల్, నప్పా లెదర్ సీట్లు, MBUX బ్యాక్ సీటు టాబ్లెట్, HEPA ఫిల్టర్‌తో శక్తినిచ్చే ఎయిర్ కంట్రోల్ ప్లస్, 15 స్పీకర్లతో బర్మెస్టర్ 3D అండ్ 710 వాట్ల సరౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్ ఇంకా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్ అండ్ స్పీడ్
మెర్సిడెస్ AMG EQS 53 107.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 200 kWh వరకు ఫాస్ట్ ఛార్జ్ ఆప్షన్ కి సపోర్ట్ చేస్తుంది. AMG EQS 53 అనువైన పరిస్థితుల్లో 580 కి.మీల వరకు, పనితీరు పరంగా AMG EQS 53 బ్రాండ్ వారసత్వానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కారు 762 hp శక్తిని, మొత్తం 1,020 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Mercedes-Benz AMG EQS 53 కారు టాప్ స్పీడ్ 250 kmph, కేవలం 3.4 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు.
Mercedes-Benz AMG EQS 53 ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ఇతర EVల కంటే కాస్ట్లీ. ఈ కారు పోర్స్చే టేకాన్ టర్బో S, ఆడి RS వంటి లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది.