మారుతీ సుజుకి కార్లకు రీకాల్: ఈ మోడల్‌లో సమస్య .. కార్ డ్రైవ్ చేయవద్దని కంపెనీ సలహా..

By asianet news telugu  |  First Published Aug 25, 2022, 6:31 PM IST

డిజైర్ టూర్ ఎస్ సెడాన్ కారులోని ఎయిర్‌బ్యాగ్ యూనిట్లలో లోపం కారణంగా కార్ల తయారీ సంస్థ 166 యూనిట్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను మార్చాల్సిన అవసరం ఉందని మారుతీ సుజుకీ తెలిపింది.


భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి  స్విఫ్ట్ డిజైర్ ఎస్ టూర్ సెడాన్‌ కార్లపై రీకాల్ ప్రకటించింది. డిజైర్ టూర్ ఎస్ సెడాన్ కారులోని ఎయిర్‌బ్యాగ్ యూనిట్లలో లోపం కారణంగా కార్ల తయారీ సంస్థ 166 యూనిట్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను మార్చాల్సిన అవసరం ఉందని, రీకాల్ ద్వారా లోపం ఉన్న యూనిట్లలో కొత్త ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చును కార్ల తయారీ సంస్థ భరిస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. కంపెనీ రీకాల్ చేసిన సెడాన్ కార్లు ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 6 నుండి ఆగస్టు 16 మధ్య ఉత్పత్తి చేసారు. 

మారుతీ సుజుకి బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రీకాల్ ఇంకా దాని వెనుక ఉన్న కారణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌లలో పొరపాటుగా ఉండవచ్చని అనుమానిస్తున్నందున వాటిని రీకాల్ చేయాల్సిన అవసరం ఉందని కార్ల తయారీ సంస్థ తెలిపింది. దీనిని సరిదిద్దకుంటే భవిష్యత్తులో ఎయిర్‌బ్యాగ్‌ ఓపెన్ సమయంలో ఈ లోపం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని మారుతీ సుజుకీ తెలిపింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను మార్చే వరకు అనుమానం ఉన్న  కార్లను ఉపయోగించే కస్టమర్‌లు కార్ నడపవద్దని లేదా ఉపయోగించవద్దని సూచించినట్లు మారుతీ సుజుకి తెలిపింది. 

Latest Videos

undefined

మారుతి సుజుకీ లోపం ఉన్న కార్ల యజమానులకు దీనిపై సమాచారం ఇవ్వనుంది. లోపం ఉన్న ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను రీప్లేస్ చేయడానికి ఆథరైజేడ్ మారుతి సుజుకి వర్క్‌షాప్ ద్వారా కస్టమర్‌లను సంప్రదిస్తారు. మారుతీ సుజుకి  "కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లోని 'Imp Customer Info' విభాగానికి వెళ్లి కార్ ఛాసిస్ నంబర్‌ను (MA3 తర్వాత 14 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్) ఎంటర్ చేసి,  ఎయిర్‌బ్యాగ్ రీప్లేస్మెంట్  అవసరమా కాదా అని చెక్ చేయవచ్చు. ఛాసిస్ నంబర్ కార్ ID ప్లేట్‌పై  ఉంటుంది ఇంకా కార్ చలాన్/రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లలో కూడా ఉంటుంది. 

భారతదేశంలో మారుతి సుజుకి డిజైర్ ఎస్ టూర్  ధర రూ. 6.05 లక్షల నుండి మొదలై రూ. 7 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. డిజైర్ S టూర్ మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది ఇంకా CNG వెర్షన్‌ కూడా వస్తుంది. ఈ సెడాన్ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఈ ఇంజన్ గరిష్టంగా 82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది.

click me!