జావా పెరాక్ బాబర్-స్టైల్ బైక్ లాంచ్

By Sandra Ashok Kumar  |  First Published Nov 11, 2019, 2:57 PM IST

జావా పెరాక్ బైక్  ఒక సంవత్సరం క్రితంమే మొట్టమొదటిగా ఆవిష్కరించబడింది. ఇప్పుడు ఇది కస్టమ్ బాబర్ డిజైన్, 334 సిసి ఇంజన్ తో కలిగి వస్తుంది.


మహీంద్రా & మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జావా పెరాక్ బాబర్ మోటార్‌సైకిల్‌ను 15 నవంబర్ 2019  ప్రవేశపెట్టనుంది. ఒక సంవత్సరం క్రితమే బ్రాండ్ లాంచ్ సందర్భంగా కస్టమ్-స్టైల్ బాబర్ బైక్ ను వెల్లడించింది.

మొదటి వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ తన మూడవ మోటార్‌సైకిల్‌ను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇది కొత్త డిజైన్ మాత్రమే కాకుండా చూడటానికి కొత్త కలర్ వేరియంట్ తో విడుదలవ్వానుంది. ఇది భారతదేశంలో విక్రయించబడే అత్యంత సరసమైన బైక్ అని చెప్పొచ్చు.

Latest Videos

also read సంక్రాంతికి బీఎస్ 6 ప్రమాణాలతో ఆడీ క్యూ 8 ఆవిష్కరణ

రెండవ ప్రపంచ యుద్ధంలో 1946 లో పారిస్ మోటార్ షోలో ఇది మొదటిసారి ఆవిష్కరించబడిన పెరాక్ బైక్ నుండి జావా పెరాక్ అని పేరు పెట్టారు. పెరాక్ బైక్  250 సిసి ఇంజన్, కానీ కొత్త జావా పెరాక్ శక్తివంతమైన 334 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్, లిక్విడ్-కూల్డ్ మోటారు, 30 బిహెచ్‌పి, 31 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను అభివృద్ధి చేస్తుంది.

బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడుకొని ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 293 సిసి ఇంజిన్‌ను ఉపయోగించే జావా మరియు జావా ఫార్టీ టుతో పోలిస్తే పెరాక్‌కు పెద్ద ఇంజిన్ లభిస్తుంది. ఇది ఎక్కువ మెకానికల్ మార్పులను పొందుతుంది.

ఇందులో లాంగ్ స్విన్ గార్మ్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లకు బదులుగా మోనోషాక్ రెస్ట్ సస్పెన్షన్ అమర్చారు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌తో వస్తుంది.

aslo read  మార్కెట్‌లోకి యమహా బీఎస్-6 బైక్‌లు.. ధర ఎంతంటే!

గత సంవత్సరం ఆవిష్కరణలో, క్లాసిక్ లెజెండ్స్ జావా పెరాక్ బైక్ ధర 1.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను ప్రకటించింది. గత సంవత్సరంలో జావా మరియు ఫార్టీ టు బైక్ ధరలు పెరగడంతో, పెరాక్ బైక్ ను అధిక ధరతో ప్రవేశపెట్టాలని మేము ఆశిస్తున్నాము.

ఇది ఆన్ రోడ్ ధర  2 లక్షలపై వరకు ఉండోచ్చు. ఈ విభాగంలో జావా పెరాక్‌కు మార్కెట్ లో ప్రత్యక్షమైన పోటీ బైక్ లేదు. జావా పెరక్ బైక్ డెలివరీలు వచ్చే ఏడాది మొదటి నెల నుండి ఎప్పుడైనా ప్రారంభమవుతాయని ఆశిస్తున్నారు.
 

click me!