ఆటోమొబైల్ ఎక్స్ పోలో రిలయన్స్ జియో, ఫేస్ బుక్ సందడి....

By Sandra Ashok Kumar  |  First Published Jan 13, 2020, 11:12 AM IST

ఆటో ఎక్స్ పో అంటే ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ప్రదర్శన. కానీ ఈ దఫా ఆటోమొబైల్ సంస్థలతోపాటు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ పాలుపంచుకోనున్నాయి.
 


న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రేటర్ నోయిడాలో జరిగే 15వ ఎడిషన్ ఆటో ఎక్స్ పో సంచలనాలకు వేదిక కానున్నది. భారీ స్థాయిలో నూతన వాహన మోడళ్ల ఆవిష్కరణ ఫ్లాట్ ఫామ్‌గా నిలువనున్నది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు దాదాపు 60 వాహనాల వరకు ఈ ఎక్స్ పో వేదికగా ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

also read ‘స్ప్లెండర్’, ‘ఫ్యాషన్’ బైక్‌లు....చరిత్రనే తిరగ రాశాయి.....

Latest Videos

undefined

ఈ ఎక్స్ పోలో మరో విశేషం కూడా ఉంది. దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, సోషల్ మీడియా జెయింట్ ‘ఫేస్ బుక్’ కూడా ఈ ఎక్స్ పోలో భాగస్వాములు కానున్నాయి. ఈ ఎక్స్ పోను ఏసీఎంఏ, సీఐఐ, సియామ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.ఆటో ఎక్స్ పో 2020 తర్వాత వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.

ప్రయాణ వాహనాల తయారీ దారుల్లో 85 శాతం, వాణిజ్య వాహనాల తయారీ దారుల్లో 75 శాతం మంది ఈ ఎక్స్ పోలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 కార్లు, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ వివరించారు.

also read వరుసగా ఐదోసారి మళ్లీ లగ్జరీ కార్ల కింగ్​గా మెర్సిడెజ్​ బెంజ్​

వీటిల్లో చాలా వాహనాలు బీఎస్-6 ప్రమాణాలతో అప్ గ్రేడ్ చేసిన ఇంజిన్లు కలిగినవై ఉండనున్నాయి. ఈ దఫా జరిగే ఆటో ఎక్స్ పోలో రిలయన్స్ జియో కూడా పాల్గొననున్నది. ఇంటర్నెట్ అనుసంధానిత కార్లలో జియో సిమ్ ఎంబెడెడ్ టెక్నాలజీని పరిచయం చేయనున్నది.

ఈ కంపెనీ ప్రతినిధులు దీన్ని ఆటోమొబైల్ పరిశ్రమకు పరిచయం చేస్తారు. ఇక సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ డిస్కషన్ ఏర్పాటు చేయనున్నది. దీంతోపాటు సుమారు 15 ఆటోమొబైల్ స్టార్టప్ కంపెనీలు తమ టెక్నాలజీని పరిచయం చేయనున్నాయి. వాటిల్లో మొబిలిటీ, సర్వీస్ కనెక్టెడ్ టెక్నాలజీలే ఉండనున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ సంస్థలు, టైర్ సంస్థలు కూడా ఈ ఎక్స్ పోలో భాగస్వాములు అవుతున్నాయి. 
 

click me!