ఇండియాలో వ్యాపారాన్ని ముగించడం పై ఎటువంటి ప్రణాళికలు లేవని, రాబోయే రోజుల్లో ఇంకా విస్తరించాలని యోచిస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది.
జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియాలో అపరేషన్స్ ముగించవచ్చని లేదా వచ్చే ఏడాదికి లైనప్ నుండి ఇప్పటికే ఉన్న చాలా మోడళ్లను తొలగించవచ్చని వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది.
ఇండియాలో వ్యాపారాన్ని ముగించడం పై ఎటువంటి ప్రణాళికలు లేవని, రాబోయే రోజుల్లో ఇంకా విస్తరించాలని యోచిస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది. ఒక నివేదిక ప్రకారం హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సిఇఒ టకుయా సుమురా మాట్లాడుతూ "మేము ఇండియాలో ఉంటాము. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఈ మార్కెట్‌ను ఎందుకు వదిలిపెడతాము..? మేము 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉన్నాము.అలాగే ఈ దేశాన్ని వదిలి వెళ్ళే కారణం లేదు." అని అన్నారు.
undefined
హోండా కార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో హోండా సిటీ, అమేజ్, WR-V ఇంకా జాజ్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. జపనీస్ ఆటో కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లాగ్‌షిప్ సెడాన్ సిటీ హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. వచ్చే ఏడాది జపనీస్ సంస్థ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవిని తీసుకురానుంది. హోండా నుండి వస్తున్న ఈ కొత్త ఎస్‌యూవి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి సెగ్మెంట్ లీడర్‌లతో పోటీపడుతుంది.
డిసెంబర్ 2020లో హోండా కంపెనీ రెండు మోడల్స్ సివిక్, సిఆర్-వి ఉత్పత్తిని నిలిపివేత, గ్రేటర్ నోయిడాలోని తయారీ కర్మాగారాన్ని మూసివేయాలనే నిర్ణయం తరువాత ఇండియాలో హోండా కార్ల పై పుకార్లు మొదలయ్యాయి. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ చొరవలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా కార్స్ పేర్కొంది. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌తో పాటు హోండా కార్స్‌కు రాజస్థాన్‌లోని టపుకరాలో మరో తయారీ ప్లాంట్ ఉంది.
భారత మార్కెట్లో CR-V, WR-V వంటి కార్లను విడుదల చేసినప్పటికీ ఎస్‌యూవి విభాగంలో హోండా కార్లు పెద్దగా విజయం సాధించలేదు. CR-V నిలిపివేసినప్పటికీ WR-V సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవి మారుతి సుజుకి, టాటా మోటార్స్ అండ్ హ్యుందాయ్ ఆధిపత్యంలో ఉన్న సెగ్మెంట్‌లో ముద్ర వేయలేకపోయింది.