మీడియా నివేదికల ప్రకారం, ఫోర్డ్ కంపెనీ ఐరోపాలోని కంపెనీ నుండి 3200 మంది ఉద్యోగులను తొలగించవచ్చు. దీనితో పాటు, కంపెనీ ఉత్పత్తి అభివృద్ధి పనులను కూడా అమెరికాకు మార్చాలని యోచిస్తోంది.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం, అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోర్డ్ 3200 మంది ఉద్యోగులను తొలగించనుంది. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు ఇండియాలో మాత్రం కాదు ఐరోపా దేశంలో. గత కొంతకాలం క్రితం ఫోర్డ్ కంపెనీ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే కంపెనీ ఏం ప్లాన్ చేస్తోంది..? ఎందుకు ఉద్యోగాల కోత విధించనుంది, దీని సంబంచించి సమాచారం తెలుసుకోండి...
ఫోర్డ్ ఉద్యోగుల తొలగింపు
మీడియా నివేదికల ప్రకారం, ఫోర్డ్ కంపెనీ ఐరోపాలోని కంపెనీ నుండి 3200 మంది ఉద్యోగులను తొలగించవచ్చు. దీనితో పాటు, కంపెనీ ఉత్పత్తి అభివృద్ధి పనులను కూడా అమెరికాకు మార్చాలని యోచిస్తోంది. కంపెనీ డెవలప్‌మెంట్ వర్క్‌లో 2500 మంది ఉద్యోగులు, అడ్మిన్ విభాగంలో 700 మంది ఉద్యోగులను తొలగించవచ్చని సమాచారం.
undefined
ఐరోపాలో ఉద్యోగులు
ఫోర్డ్ మోటార్స్ కి ఐరోపాలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం, కంపెనీ ఐరోపాలో దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొలోన్‌లోనే(Cologne) 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
భవిష్యత్తు కోసం
కంపెనీ ఫ్యూచర్ కార్ల కోసం సిద్ధమవుతోంది. మీడియా కథనాల ప్రకారం, కంపెనీ ఏడు కొత్త ఎలక్ట్రిక్ మోడల్ కార్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కార్లను తీసుకురావడానికి, జర్మనీ, టర్కీలో తయారీ సైట్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ముందుగా తీసుకున్న చర్యలు
నివేదికల ప్రకారం, గత సంవత్సరం ద్వితీయార్థంలో USలో 3,000 ఉద్యోగాలను తొలగించిన తర్వాత ఫోర్డ్ ఇప్పుడు యూరప్‌లో ఉద్యోగుల కోత విధించేందుకు సిద్ధమవుతోంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఫార్లీ ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంలో $50 బిలియన్లకు ఆర్థిక సహాయం చేయడానికి ICE మోడల్ నుండి లాభాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నందున తొలగింపులు లక్ష్యంగా చేసుకున్నారు.
కంపెనీ ఏం చెప్పింది
మీడియా నివేదికల ప్రకారం, ఫోర్డ్ ప్రతినిధి ఐరోపాలో కోతలపై స్పందించెందుకు నిరాకరించారు, ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రతికూల రాబడుల మధ్య ప్యాసింజర్ కార్ల లైనప్ కోసం మార్కెట్ వాటాను నిలుపుకోవడంలో కష్టపడుతున్న కంపెనీ ఐరోపాలో కూడా ఉనికిని మెరుగుపరుస్తుంది.