సేఫెస్ట్ కారుగా న్యూ హోండా కార్.. క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్.. లేటెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తుంది..

By asianet news telugu  |  First Published Jan 21, 2023, 6:29 PM IST

టెస్టింగ్ సమయంలో, హోండా WR-V అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 34.26 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అసెస్‌మెంట్ కేటగిరీలో 16.78 పాయింట్లు స్కోర్ చేసింది. ఇంకా సేఫ్టీ అసిస్ట్‌కి 15.58 పాయింట్లు, మోటర్‌సైక్లిస్ట్ సేఫ్టీ విభాగంలో 10.45 పాయింట్లు సాధించింది. 


ఏఎస్ఈ‌ఏ‌ఎన్ ఎన్‌సి‌ఏ‌పి క్రాష్ టెస్ట్‌లో హోండా డబల్యూఆర్-వి సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూ‌వి 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. హోండా కార్స్ తాజాగా సౌత్ ఈస్ట్ ఆసియా మార్కెట్ల కోసం సబ్-కాంపాక్ట్ ఎస్‌యూ‌వి విభాగంలో దీనిని లాంచ్ చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్ సమయంలో ఈ ఎస్‌యూ‌వి మొత్తం స్కోర్ 77.07 స్కోర్ చేసింది.

హోండా WR-V కొత్త జనరేషన్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ప్రిటెన్షనర్ సీట్ బెల్ట్‌లు వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇంకా సేఫ్టీ ఆసిస్టన్స్ టెక్నాలజీస్ వంటి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ సపోర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, SUVలో ఆటోమేటిక్ హై బీమ్స్ వంటి హైవే సిస్టమ్‌లను కూడా అందిస్తుంది. 

Latest Videos

undefined

టెస్టింగ్ సమయంలో, హోండా WR-V అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 34.26 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అసెస్‌మెంట్ కేటగిరీలో 16.78 పాయింట్లు స్కోర్ చేసింది. ఇంకా సేఫ్టీ అసిస్ట్‌కి 15.58 పాయింట్లు, మోటర్‌సైక్లిస్ట్ సేఫ్టీ విభాగంలో 10.45 పాయింట్లు సాధించింది. 

టెస్టింగ్ మోడల్ ఫీచర్లు 
ASEAN NCAP ద్వారా పరీక్షించిన ఎస్‌యూ‌వి స్టాండర్డ్ గా 4 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. ఇంకా దీనికి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ముందు ప్రయాణీకుల కోసం సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ (SBR), పాదచారుల ప్రొటెక్షన్ టెక్నాలజి కూడా ఉంది. 

కొత్త అండ్ పాత WR-V మధ్య తేడా ఏంటి 
భారతదేశంలో విక్రయించబడుతున్న WR-V కంటే కొత్త హోండా WR-V సైజ్ లో పెద్దది. దీని పొడవు 4,060 ఎం‌ఎం, వెడల్పు 1,780 ఎం‌ఎం, ఎత్తు 1,608 ఎం‌ఎం. ఇది ఇండియాలో విక్రయించబడిన WR-V కంటే దాదాపు 60 ఎం‌ఎం పొడవు, 46 ఎం‌ఎం వెడల్పు, 7 ఎం‌ఎం పొడవు ఎక్కువ. కొత్త WR-V 220ఎం‌ఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. కొత్త హోండా WR-V 16-అంగుళాల ఇంకా 17-అంగుళాల అల్లాయ్‌లతో  టు వీల్స్ సైజ్ ఆప్షన్స్ తో అందించబడుతుంది. 

హోండా డబ్ల్యూఆర్-వి ఇంటీరియర్ లో  కూడా చాలా మార్పులు చూడవచ్చు. టు డ్యూయల్-టోన్ ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లతో  WR-V రెడ్ స్టిచింగ్‌తో లెదర్ సీట్లు పొందుతుంది. సెంటర్ కన్సోల్‌లో డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్,  సెమీ-డిజిటల్ TFT డ్రైవర్ డిస్‌ప్లే 4.2 అంగుళాలు ఉంటుంది. బూట్ స్పేస్ కూడా 380 లీటర్లకు పెంచబడింది, ఇది ఇండియా-స్పెక్ WR-V కంటే 17 లీటర్లు ఎక్కువ. హోండా WR-V SUVని కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఇతర ఆధునిక ఫీచర్లతో అందిస్తుంది.

click me!