కామెట్ ఈవి అనేది ఆస్టర్, హెక్టార్, క్లోస్టర్, జెడ్‌ఎస్ ఈవి తర్వాత భారతదేశంలో ప్రారంభించబడిన ఎంజి ఐదవ మోడల్. MG కామెట్ EVకి మూడు డోర్లు ఉంటాయి. ఇది ప్రాథమికంగా రీబ్యాడ్జ్ చేయబడిన వులింగ్ ఎయిర్ EV.
ఎంజి మోటార్ ఇండియా తాజాగా రాబోయే బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనం (EV) పేరును వెల్లడించింది. దీని పేరు ఎంజి కామెట్. ఎంజి కామెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఈ వాహనం గురించి ఇప్పటివరకు వెల్లడించిన కొన్ని ఫీచర్లను చూద్దాం...
ఎంజి కామెట్ EV భారతదేశంలో 2023 రెండవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. అయితే ఏప్రిల్‌లో ప్రవేశపెట్టవచ్చు. తాము బడ్జెట్ ధరలో కామెట్ EVని విడుదల చేయబోతున్నామని MG చెప్పగా, MG కామెట్ EV ధర రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుందని చెప్పబడింది.
undefined
MG కామెట్ EVకి మూడు డోర్లు ఉంటాయి. ఇది ప్రాథమికంగా రీబ్యాడ్జ్ చేయబడిన వులింగ్ ఎయిర్ EV. దీనిని ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్‌లో విక్రయించబడటం గమనార్హం. ఈ కారుకి LED హెడ్‌లైట్‌లు, LED టెయిల్‌లైట్‌లతో పూర్తి-LED లైటింగ్ సెటప్‌తో వస్తుంది. దీనికి 13 అంగుళాల వీల్స్ ఉన్నాయి.
క్యాబిన్ లోపల, ఎలక్ట్రిక్ కారుకి 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ కూడా ఉంది. MG కామెట్ EV 25kWh బ్యాటరీతో 50kW మోటార్‌ను జత చేయవచ్చు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 250 కి.మీల పరిధిని ఉంటుందని కూడా భావిస్తున్నారు.
ఎంజి కామెట్ EV Tata Tiago ev, Citroen e-C3 లకు పోటీగా ఉంటుంది. Tata Tiago ev ధర రూ. 8.69 లక్షల నుండి రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), Citroen E-C3 ధర రూ. 11.50 లక్షల నుంచి రూ. 12.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇటీవల విడుదల చేసిన హెక్టర్ 2023, క్లోస్టర్ అండ్ ZS EV అలాగే Aster తర్వాత MG కామెట్ భారతదేశంలో ఎంజి ఐదవ మోడల్.