వెరైటీ డ్రెస్సులు ధరించి రోజురోజుకు సెన్సేషన్ సృష్టిస్తున్న మోడల్ ఉర్ఫీ జావేద్ రెడ్ కలర్ జీప్ మెరిడియన్ ఎస్‌యూవీని కొన్నారు. ఉర్ఫీ జావేద్ కొనుగోలు చేసిన జీప్ మెరిడియన్ ఉర్ఫీ లాగే హాట్ గా ఉంది. అంతేకాదు ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
ఫ్యాషన్ ప్రపంచంలో బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ పేరు మార్మోగుతోంది. ఉర్ఫీ జావేద్ డ్రెస్ అండ్ థీమ్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఉర్ఫీ జావేద్ ఏ ఫ్యాషన్ డ్రెస్ లో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఉర్ఫీ జావేద్ డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఏంటంటే ఆమె తాజాగా రెడ్ హాట్ డ్రెస్ లో కనిపించింది. ఈ సర్‌ప్రైజ్ కంటే ముందే ఉర్ఫీ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఉర్ఫీ జావేద్ వెల్వెట్ రెడ్ జీప్ మెరిడియన్ SUVని కొనుగోలు చేసింది. ఈ 7 సీట్ల జీప్ మెరిడియన్ కారును కొనుగోలు చేయడానికి ఉర్ఫీ జావేద్ వెల్వెట్ హాట్ రెడ్ కలర్ డ్రెస్‌లో వచ్చారు. ఇది అందరి దృష్టిలో పడింది.
ఉర్ఫీ జావేద్ కొనుగోలు చేసిన జీప్ మెరిడియన్ 7 సీటర్ SUV ధర రూ. 30 లక్షల నుండి రూ. 37.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఉర్ఫీ జావేద్ టాప్ మోడల్ జీప్ మెరిడియన్ కారును కొన్నారు. దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.45 లక్షలు. ఉర్ఫీ జావేద్ కొనుగోలు చేసిన కొత్త కారు భారతదేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
ఉర్ఫీ జావేద్ జీప్ బ్రాండ్ కారును కొనడం ఇదేం మొదటిసారి కాదు. 2022లో ఆమె జీప్ కంపాస్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు నీలిరంగు కారు. అయితే ఉర్ఫీ జావేద్ జిప్ కంపాస్ కారు ఎక్స్ఛేంజ్ చేసి మెరిడియన్‌ని కొనుగోలు చేశారా లేదా కొత్తది కొనుగోలు చేశారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.
జీప్ మెరిడియన్ టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా ఉంటుంది. ఈ కొత్త కారులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో పెద్ద సన్‌రూఫ్ సౌకర్యం, ప్లాటింగ్ టైప్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఉన్న ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, LED DRL, జీప్ బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్ ఉంది. కానీ కంపాస్ కారు కంటే పెద్దది. టెయిల్ ల్యాంప్ కూడా LED కానీ స్టైలిష్ లుక్‌తో వస్తుంది.
జీప్ మెరిడియన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. జీప్ మెరిడియన్ డీజిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ లేదు. ఈ కార్ 170 Ps పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ గేర్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ఉన్నాయి.
భారతదేశంలో జీప్ బ్రాండ్ కంపెనీ జీప్ కంపాస్, జీప్ మెరిడియన్, జీప్ రాంగ్లర్, జీప్ గ్రాండ్ చెరోకీలను విక్రయిస్తుంది. ఫిబ్రవరి నెలలో జీప్ బ్రాండ్ 719 కార్లను విక్రయించింది. జీప్ కంపాస్ అండ్ జీప్ మెరిడియన్ కార్లకు మంచి డిమాండ్ కూడా ఉంది.