బజాజ్ చేతక్ రిబ్యాక్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్స్ ఇప్పుడు సరికొత్తగా..

By asianet news teluguFirst Published Mar 13, 2023, 9:03 PM IST
Highlights

కొత్త వెర్షన్ ప్రీమియం మెటీరియల్స్‌తో వస్తుంది. ఇప్పుడు స్కూటర్ బుకింగులు మొదలయ్యాయి. ఏప్రిల్ 2023లో డెలివరీలు ప్రారంభమవుతాయి. సాధారణ చేతక్ ధర ఇప్పుడు రూ. 1,21,933 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు).

వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లో కొత్త 2023 చేతక్ ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ చేతక్ ప్రీమియం మెటీరియల్స్‌తో వస్తుంది. స్కూటర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ 2023లో డెలివరీలు ప్రారంభమవుతాయి. సాధారణ చేతక్ ధర ఇప్పుడు రూ. 1,21,933 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). 

2023 బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ బిగ్ కలర్ LCD కన్సోల్‌తో వస్తుంది, ఈ కన్సోల్ వాహన సమాచారాన్ని మరింత స్పష్టతతో చూపిస్తుంది. చేతక్ లైనప్‌లో ఇది కొత్త టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త టూ-టోన్ సీట్, బాడీ-కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్ అండ్ మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్‌లతో వస్తుంది. 

చేతక్ ప్రీమియం ఎడిషన్ లో ఆల్-మెటల్ బాడీ ఇంకా ఆన్‌బోర్డ్ ఛార్జర్‌  ఉంది. స్కూటర్ మూడు కొత్త కలర్స్ లో లభిస్తుంది - మాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం 60కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది. మార్చి 2023 నాటికి 85 నగరాల్లోని 100 స్టోర్లలో చేతక్ అందుబాటులో ఉంటుందని బజాజ్ తెలిపింది. 

బజాజ్ చేతక్ 1890ఎం‌ఎం పొడవు, 1330ఎం‌ఎం వీల్ బేస్ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు ఎత్తు 760ఎం‌ఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 160ఎం‌ఎం. ఇ-స్కూటర్ 90/90 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌లతో 12-అంగుళాల వీల్స్ పై నడుస్తుంది.

బ్రేకింగ్ కోసం, స్కూటర్ ముందు భాగంలో డిస్క్ అండ్ వెనుక భాగంలో డ్రమ్‌ని పొందుతుంది. చేతక్ ముందు వైపున సింగిల్ సైడ్  లీడింగ్ లింక్‌ను, వెనుకవైపు ఆఫ్‌సెట్ మోనో షాక్‌ పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 2.893kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి పవర్ తీసుకుంటుంది. ఎలక్ట్రిక్ మోటార్  పవర్ 4.2kW ​​(5.63hp), టార్క్20Nm. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 108 కి.మీల ARAI సర్టిఫైడ్ మైలేజ్ అందిస్తుంది, అయితే రియల్-వరల్డ్ రేంజ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ. ఇంకా గంటకు 63 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. 

click me!