30 కి.మీ మైలేజ్, ఎక్కువ బూట్ స్పేస్, ధర కేవలం 6 లక్షలు.. ఈ పాపులర్ కారుని కొనేందుకు వెనుకాడరు!

By asianet news telugu  |  First Published May 19, 2023, 6:52 PM IST

మారుతి సుజుకి బాలెనో మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పవర్ ఫుల్ 1197 సిసి ఇంజన్‌ను అందిస్తుంది . ఈ ఇంజన్ 76.43 నుండి 88.5 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బాలెనోలో మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. 


ఇండియన్ కార్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది . అధిక మైలేజీ, అందుబాటు ధరతో పాటు ప్రజలు ఈ ఫ్యామిలీ కార్లలో ఏక్కువ  బూట్ స్పేస్ కూడా  చూస్తారు. మారుతి సుజుకి బాలెనో ఈ విభాగంలో అత్యంత పవర్ ఫుల్  కార్లలో ఒకటి. ప్రముఖ మోడల్ బాలెనో కొన్ని ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి.. 

పవర్ ఫుల్ ఇంజన్ 
మారుతి సుజుకి బాలెనో మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పవర్ ఫుల్ 1197 సిసి ఇంజన్‌ను అందిస్తుంది . ఈ ఇంజన్ 76.43 నుండి 88.5 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బాలెనోలో మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ పెట్రోల్ ఇంకా  CNG వెర్షన్లను కూడా అందిస్తుంది. పెట్రోల్ వెర్షన్ కారు 22.35 నుండి 22.94 kmpl మైలేజీని అందిస్తుంది. అలాగే  CNG వెర్షన్ 30.61km/kg మైలేజీని అందిస్తుంది. మారుతి బాలెనో 5-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 

Latest Videos

undefined

స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు
మారుతి సుజుకి ఈ ఫ్యామిలీ కారులో ఫుల్ సేఫ్టీ అందిస్తుంది. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల అప్షన్ ఉంది. అంతే కాకుండా, కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్‌లు, చైల్డ్ సీట్లకు ఐసోఫిక్స్ ఎంకరేజ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

ఇందులో నాలుగు ట్రిమ్‌లు సిగ్మా, డెల్టా, జీటా అండ్  ఆల్ఫా తో  ఆకర్షణీయమైన కలర్ అప్షన్స్  ఉన్నాయి. కంపెనీ నెక్సా బ్లూ, పెరల్ ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఓపులెంట్ రెడ్ లక్స్ బీజ్ కలర్ ఆప్షన్‌లను అందిస్తుంది.

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
కారులో  ఎక్కువ లగేజీ కోసం 318 లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ ఇచ్చింది. 55-లీటర్ ఇంధన ట్యాంక్ ఇంకా CNGతో అప్షన్ కూడా  ఉంది. ఈ కారు గరిష్టంగా 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో ఈ కారు తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ కారు హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఇంకా  కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో వస్తుంది. 

 కారు ధర
ఈ మారుతి కారు ధర రూ. 6.61 లక్షల నుండి రూ. 9.88 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్, సిట్రోయెన్ C3, టయోటా గ్లాంజాలకు పోటీగా వస్తుంది.

click me!