ఇటాలియన్ లుక్స్, అద్భుతమైన బ్రేకింగ్.. ఈ స్కూటర్ ధర తెలిస్తే అవాక్కవుతారు..

By asianet news telugu  |  First Published May 17, 2023, 5:58 PM IST

ఈ స్కూటర్ భారతదేశంలో రూ. 49,699 వేల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని మొత్తం బరువు 90 కిలోలు. ఈ  స్కూటర్‌ను కంట్రోల్ చేయడం  రైడర్‌కు సులభతరం చేస్తుంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన కొన్ని వివరాలు మీకోసం.. 


ద్విచక్ర వాహనాన్ని లేదా కార్ కొనే  ముందు  సేఫ్టీ ఫీచర్స్ గురించి తరచుగా ఆరా తీస్తాము. అయితే ఎవోలెట్ పోలో అద్భుతమైన బ్రేకింగ్ ఫీచర్లతో కూడిన ఇటువంటి  ఇ-స్కూటర్. ఈ స్కూటర్ భారతదేశంలో రూ. 49,699 వేల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని మొత్తం బరువు 90 కిలోలు. ఈ స్కూటర్‌ను కంట్రోల్ చేయడం రైడర్‌కు సులభతరం చేస్తుంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన కొన్ని వివరాలు.. 

250W థ్రస్ట్ మోటార్
ఈ స్కూటర్ మార్కెట్లో రెండు వేరియంట్‌లలో  సింగిల్  కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 63,799 వేలు. ఎవోలెట్ పోలో 250W శక్తిని అందిస్తుంది. కాబట్టి ఎక్కువ బరువుతో కూడా రోడ్డుపై పరుగెత్తగలుగుతుంది. ఈ స్కూటర్ ఎనిమిది గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

Latest Videos

undefined

పవర్ ఫుల్  బ్రేకింగ్ సిస్టమ్
భద్రత కోసం స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇంకా ప్రమాద సమయంలో దీనిని కంట్రోల్ చేయడానికి రైడర్‌కు ఎక్కువ సమయం ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది రెండు వీల్స్  ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

ఇటాలియన్ స్టైల్
కంపెనీ ప్రకారం, ఎవోలెట్ పోలో  ఇటాలియన్ స్కూటర్. ప్రతిరోజు  చిన్న  ప్రయాణల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని సీటింగ్ ఇంకా  డిజైన్ సౌకర్యవంతమైన రైడ్‌కు గొప్ప శ్రద్ధ చూపాయి. దీని సీటు ఎత్తు 760 ఎంఎం. కాబట్టి తక్కువ ఎత్తు ఉన్నవాళ్లు కూడా సులభంగా రైడ్ చేయవచ్చు.

హై స్పీడ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ కారణంగా  సిటి,  మట్టి రోడ్లలో కూడా ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్  గంటకు 25 కి.మీ. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రెండు వేరియంట్‌ల పేర్లు పోలో జెడ్ అండ్ పోలో క్లాసిక్. ఇందులో 48V/24Ah VRLA బ్యాటరీ ప్యాక్ ఉంది.

click me!