బెంజ్, వోల్వో , ఆడి కార్లకు పోటీగా జాగ్వార్ కొత్త మోడల్‌ కారు

By Sandra Ashok Kumar  |  First Published Dec 16, 2019, 11:32 AM IST

 టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ కారు తాజాగా ఎక్స్ఈ కారును హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే వచ్చే ఏడాది వినియోగదారులకు లభిస్తుంది. దీని ధర రూ.44.98 లక్షల నుంచి రూ.46.32 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం జాగ్వార్‌ విభాగంలో ఐదు మోడల్ కార్లు మార్కెట్లో లభిస్తున్నాయి. బీఎండబ్ల్యూ 3 సీరిస్‌, మెర్సిడెజ్‌-బెంజ్‌ సీ-క్లాస్‌, వొల్వో ఎస్‌60, ఆడీ ఏ4లకు పోటీగా సంస్థ ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.


హైదరాబాద్‌: టాటా మోటర్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2020 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఈ నూతన ‘ఎక్స్‌ఈ’ మోడల్‌ ప్రారంభ ధరను రూ.44.98 లక్షలుగా నిర్ణయించింది.  గరిష్ఠంగా ఎక్స్‌ఈ ఎస్‌ఈ మోడల్‌ విలువను రూ.46.32 లక్షలకు జేఎల్ఆర్ విక్రయిస్తున్నది. 

also read వోల్వో నుంచి ఎంట్రీ లెవెల్ ఎస్‌యూ‌వి ‘ఎక్స్‌సీ40 టీ4’

Latest Videos

undefined

జాగ్వార్ ఎస్ఈ ఎస్ డీజిల్ మోడల్ కారు ధర రూ.44.98 లక్షలకు, జాగ్వార్ ఎస్ఈ డీజిల్ కారు రూ.46.32 లక్షలకు లభిస్తుంది. ఎక్స్ఈ పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.44.98 లక్షలకు, ఎస్ఈ మోడల్ కారు ధర రూ.46.32 లక్షలకు అందుతుంది. 

2.0 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌తో తయారు చేసిన ఈ కారును టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసింది సంస్థ. వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయం, ఎయిర్‌ క్వాల్టీ సెన్సార్‌, నావిగేషన్‌తో నేరుగా అనుసంధానం, వై-ఫై, హాట్‌స్పాట్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయని జేఎల్‌ఆర్‌ ప్రైడ్‌ మోటర్స్‌ ఎండీ సురేశ్‌ రెడ్డి తెలిపారు. 

also read  కారు కొనాలనే వారికి ఇదే కరెక్ట్ టైం...బ్రాండెడ్ కార్లపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు 

ప్రస్తుతం జాగ్వార్‌ విభాగంలో ఐదు మోడల్ కార్లు మార్కెట్లో లభిస్తున్నాయి. బీఎండబ్ల్యూ 3 సీరిస్‌, మెర్సిడెజ్‌-బెంజ్‌ సీ-క్లాస్‌, వొల్వో ఎస్‌60, ఆడీ ఏ4లకు పోటీగా సంస్థ ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.

click me!