ఈ రాశివారు తమ అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేస్తారు. వారిని ఎవరైనా ఇగ్నోర్ చేసినట్లు అనిపిస్తే వీరు తట్టుకోలేరు.
కొందరికి ఎప్పుడూ అటెన్షన్ కావాలి. ఎవరో ఒకరు తమపై అటెన్షన్ చూపిస్తూ ఉండాలి. అలా కాకుండా ఎవరైనా తమను ఇగ్నోర్ చేసినట్లు వారికి అనిపిస్తే వారు తట్టుకోలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు.. ఎవరైనా తమను ఇగ్నోర్ చేస్తే భరించలేరు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
1.మేషం
undefined
మేషరాశి వారి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. చాలా దృఢంగా ఉంటారు. వీరికి సహజంగానే నాయకుల లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశివారు తమను ప్రతి ఒక్కరూ తమను చూసుకుంటూ ఉండాలని, తాము చెప్పేది వినాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు తమ అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేస్తారు. వారిని ఎవరైనా ఇగ్నోర్ చేసినట్లు అనిపిస్తే వీరు తట్టుకోలేరు.
2.సింహ రాశి..
సింహ రాశివారు చాలా నమ్మకంగా, ధైర్యంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఎక్కడకు వెళ్లినా.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు. తమ టాలెంట్ ని అందరూ చూడాలని ఆత్రుత పడుతూ ఉంటారు. ఇలాంటి వీళ్లను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. పిచ్చి కోపం వచ్చేస్తుంది.
3.ధనుస్సు
ధనుస్సు ఒక అగ్ని సంకేతం. ఈ రాశిని బృహస్పతి పాలిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఆశాజనకంగా, సాహసోపేతంగా , స్వేచ్ఛాయుతంగా ఉంటారు. వారు కొత్త విషయాలను అన్వేషించడానికి , నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వారు తమ ఉత్సాహాన్ని, ఉత్సుకతను పంచుకునే వ్యక్తుల చుట్టూ ఉండటం ఆనందిస్తారు. ఈ రాశివారిని ఎవరైనా ఇగ్నోర్ చేస్తే తట్టుకోలేరు.
4.మిథున రాశి..
మిథునరాశి వారు కమ్యూనికేటివ్, ఉత్సుకత , అనుకూలత కలిగి ఉంటారు. వారు ఇతరులతో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతారు. వారు సహజంగానే ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలను అన్వేషించడంలో ఆనందిస్తారు. ఎవరైనా ఇగ్నోర్ చేస్తే... వీరు అటెన్షన్ కోసం మరొకరితో కమ్యూనికేట్ అవ్వాలని చూస్తారు.
5.తుల రాశి..
తుల రాశివారు స్నేహితులను సంపాదించడానికి ,సంబంధాలను నిర్మించడానికి సహజమైన ప్రతిభను కలిగి ఉంటారు. ఎవరైనా వారిని విస్మరించినట్లు భావించినప్పుడు, వారు మూడీగా మారవచ్చ. వారు కోరుకునే దృష్టిని పొందడానికి పరిస్థితులను లేదా వ్యక్తులను మార్చడానికి కూడా ప్రయత్నించవచ్చు.