గుమ్మం ముందు చెప్పులు ఎందుకు విప్పకూడదు..?

By telugu news team  |  First Published Jun 28, 2023, 3:19 PM IST

చెప్పులు, బూటులను ఇంటి ముఖ ద్వారంలో ఉంచకూడదు ఎందుకంటే అది శ్రీ గణేష్ ను అవమానించినట్లు అవుతుంది. 


వాస్తులో మనం చేసే అనేక పనులకు సంబంధించి నియమాలు, నమ్మకాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి గుమ్మం ముందు చెప్పలు విప్పకూడదు అని చెబుతుంటారు.  వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ కి ఎదురుగా చెప్పులు, బూట్లు ఎందుకు పెట్టకూడదో తెలుసుకుందాం. .

ఇంటి ముఖ్య ద్వారం (ప్రధాన ద్వారం) శ్రీ గణేన సంకేతంగా పరిగణిస్తారు. రాహు ఇంటి గుమ్మం దగ్గర  నివసిస్తున్నాడు అనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ కారణం కోసం, ఇంటి గుమ్మం ఆవరణను సంపూర్ణంగా ఉంచాలి. లేకుంటే రాహువున చెడు పరిణామాలను ఎదుర్కోవచ్చు.

Latest Videos

undefined


వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో సంతోషం, సమృద్ధి, పురోగతి ముఖ్య ద్వారం వస్తుంది. అదనంగా,ఇంటి ముంగిళ్లు శుభ్రంగా ఉంచుకుంటే, రాహువు ఆనందిస్తాడట. ఈ విధంగా, ఇంటి ముఖ్య తలుపులు, కొత్త గృహాల నిర్మాణం సమయంలో జ్యోతిష్యానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటించాలి.

చెప్పులు, బూటులను ఇంటి ముఖ ద్వారంలో ఉంచకూడదు ఎందుకంటే అది శ్రీ గణేష్ ను అవమానించినట్లు అవుతుంది. దీనితో గణేష్ కోపంగా ఇంటి నుండి వెళ్లిపోతాడు.

ఇంటి ముఖ ద్వారం వద్ద చెప్పులు వదిలిపెట్టినప్పుడు, రాహువు ఆగ్రహిస్తాడట. దీని వల్ల ఇంట్లో అశుభం జరుగుతుంది. అందుకే, గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు. అంతేకాదు, రాహువు ఆగ్రహించడం వల్ల దురుదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

అంతేకాకుండా, లక్ష్మీ దేవికి కూడా కోపం వస్తుందట. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ తప్పు మాత్రం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ చెప్పులను వాటిని ఎక్కడ ఉంచాలి అనే అనుమానం మీకు రావచ్చు. వీటిని మరీ గుమ్మం ముందు కాకుండా, కాస్త పక్కనగా పెట్టుకోవాలి. లేదంటే షూ ర్యాక్ లో ఉంచుకోవడం ఉత్తమమైన పని

click me!