సోమవారం, శనివారం మాంసం ఎందుకు తినకూడదు..?

By Ramya news teamFirst Published Jan 24, 2022, 3:41 PM IST
Highlights

సాధారణంగా సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసం తినే హిందువులు చాలా మంది  మటన్, చికెన్, చేపల గుడ్లను ముట్టుకోరు. అలాగే ఏకాదశి, పండగ విందులు, సముదాయాలు, కారణజన్ములు, పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో నాన్ వెజ్ వినియోగం తగ్గిస్తారు


హిందూ మత విశ్వాసాలు, ఆచారాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మందికి  వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలియదు.. కానీ పెద్దలు చెప్పిన వాటిని ఆచరిస్తూనే ఉంటారు.  కొందరేమో వాటిని మూఢ నమ్మకాలుగా భావిస్తుంటారు.  వాటిని ఆచరించకూడదంటూ ఇతరులను వాదిస్తూ ఉంటారు. అయితే.. ఆ ఆచారాలను మతపరంగా కాకుండా..వాటి వెనక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఆచారానికీ శాస్త్రీయ కారణం ఉంటుందట. మరి  కారణాలేంటో ఓసారి చూసేద్దాం.. .

సాధారణంగా సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసం తినే హిందువులు చాలా మంది  మటన్, చికెన్, చేపల గుడ్లను ముట్టుకోరు. అలాగే ఏకాదశి, పండగ విందులు, సముదాయాలు, కారణజన్ములు, పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో నాన్ వెజ్ వినియోగం తగ్గిస్తారు.. ఇలా ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక మతపరమైన భావన మాత్రమే కాదు, మీ ఆరోగ్యంపై కూడా ఆందోళన ఉంది.

మొదటిది, హిందూ మతం ఒక జంతువును చంపడం , ఏదైనా ప్రాణాన్ని తీసుకోవడం పాపమని చెబుతుంది. అంతేకాకుండా.. ఇలా  ఆ రోజు, ఈ రోజు తినకూడదు అని చెప్పడం వల్ల జంతు వధ కాస్తైనా తగ్గుతుందని వారి నమ్మకం. అందుకే అలా చెబుతుంటారు.

అలా లేకపోతే.. చాలా మంది ప్రతిరోజూ మాంసాహారం తింటారు. అది చివరకి ఓ వ్యసనంగా మారుతుంది. ఇలా అతిగా మాంసాహారం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. కొవ్వు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి కనిపించడం ప్రారంభిస్తాయి. గుండె సమస్యలు పెరుగుతాయి. పెద్దప్రేగు క్యాన్సర్, రక్తపోటు, కిడ్నీలో రాళ్లు, మూలవ్యాధులు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

అలాగే శరీర పోషణకు కొద్దిపాటి మాంసం మాత్రమే సరిపోతుంది. అతిగా తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం మన మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, నోటి మాటతో తినవద్దు అంటే ఎవరూ పట్టించుకోరు. అందుకే, సోమ, మంగళ, గురు, శనివారాల్లో కొన్ని దేవుళ్లకు సంబంధించిన మతపరమైన విధి ని పెట్టారు. దేవుడి పేరు చెబితే అయినా తినకుండా ఉంటారని అలా చెప్పడం మొదలుపెట్టారు.

సోమవారం శివుని రోజు,
మంగళవారం ఆంజనేయుడి రోజు,
గురువారం దత్తాత్రేయ మరియు సాయిబాబాల రోజు.
శనివారం ఆంజనేయుడు, వెంకటరమణ స్వామి రోజు.


మొత్తానికి వారానికి ఒకసారి నాన్ వెజ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే..సంక్షేమం పరంగా మాంసాహారుల కంటే శాఖాహారులు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకోసమైనా.. ప్రతిరోజూ మాంసం తినడం మానేయాలి.

click me!