గణపతి ముందు గుంజీలు ఎందుకు తీయాలి...?

By telugu teamFirst Published Sep 17, 2019, 12:26 PM IST
Highlights

ఏ పూజ చేసినా ముందుగా గణపతి ఆరాధనే ఎందుకు చేయాలి ? సాధారణంగా తెలిసినవి గణపతి మరో పేరు విఘ్నేశ్వరుడు. అనగా విఘ్నాలకు అధిపతి. అనగా మనం చేసే ఏ పనులకు అయినా ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తి చేసి వాటి ఫలితాలు అనుభవంలోకి రావాలి అని మన కోరిక. కనుకనే తొలుత విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం.

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే

భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. దీనినే గణపతి వ్రతంగా జరుపుకుంటారు. ఈ రోజున ఆకాశంలో సూర్యోదయానికి ముందే వినాయకమండలం ఆకారంగా నక్షత్రాలు ఆవిర్భవిస్తాయి. మనం చేసుకునే అన్ని పండుగలకు కూడా ఖగోళశాస్త్రం ముఖ్యమైనది. ఆకాశంలో కనిపించే నక్షత్రాల ఆధారంగా మాత్రమే ఆరోజున ఆ వ్రతం, పండుగలు జరుపుకోవాలని నిర్ణయించబడినది.

ఏ పూజ చేసినా ముందుగా గణపతి ఆరాధనే ఎందుకు చేయాలి ? సాధారణంగా తెలిసినవి గణపతి మరో పేరు విఘ్నేశ్వరుడు. అనగా విఘ్నాలకు అధిపతి. అనగా మనం చేసే ఏ పనులకు అయినా ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తి చేసి వాటి ఫలితాలు అనుభవంలోకి రావాలి అని మన కోరిక. కనుకనే తొలుత విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం.

ఇంకో విశేషమేమంటే గణపతి భూమ్యాకర్షణశక్తికి కారకుడు. అనగా గణపతికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది.  అలాగే మన శరీరంలో ఉండే ష్‌ చక్రాలలో మూలాధార చక్రానికి గణపతి ఆధారం. ఈ మూలాధార చక్రం అనేది శరీరంలో వెన్నుపూస మొద్లో ఉంటుంది. అనగా ప్రారంభంలో ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో ఆధారమైనది. ఈ వెన్ను పూస సరిగ్గా ఉంటేనే మనిషి నిలబడి తన పనులు తాను చేసుకోగలుగుతాడు. మన శరీరం మొత్తం మూలాధార చక్రంతోనే ముడి పడి ఉంది. ఇది సరిగ్గా మనం కూర్చున్నపుడు వెన్నెముకకు క్రింది భాగంలో చివరగా ఉంటుందన్న మాట. గుంజీళ్ళు తీసేటప్పుడు ఈ చక్రం చైతన్యవంతమై మనలోని ఆధ్యాత్మిక పురోగతి వృద్ధి అవుతుంది.

గుంజీళ్ళు తీసేటప్పుడు మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. సాధారణంగా మన నాసికంలోని రెండు రంధ్రాల నుండి ఒకేసారి గాలి పీల్చటం కాని వదలటం కానీ చేయం. ఏదో ఒక రంధ్రం మాత్రమే ఉపయోగిస్తాం. కనీసం మనకు అవగాహన కూడా ఉండదు. ఒకసారి కావాలంఏ మీ నాసికా రంధ్రాల దగ్గర చేతి వేలు ఉంచుకుని పరీక్షించండి. ఇది మీక అర్థం అవుతుంది. అయితే ఈ గుంజీళ్లు తీసిన తర్వాత నాసిక లోని రెండు రంధ్రాలు మన శ్వాస క్రియకు ఉపయోగపడడం మనం గమనించవచ్చు. అందుకే గుంజిళ్ళు తీయడం అనేది ఒక రకంగా ప్రాణాయామ శక్తిని పెంపొందించడానికి మరియు ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తుందని చెప్తారు.

ఈ గుంజీళ్ళు తీయడం అనే అలవాటు ప్రతీరోజు చేసుకోవడం మంచిది. శరీరంలో మూలాధారశక్తిని ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మూలాధార చక్రం అనేది వెన్నుపూస చివరలో ఉంటుంది అనుకున్నాం కదా. ఇక్కడ అందరికీ శక్తి ఉంటుంది. ఈ శక్తి కూడా ముడుచుకుని ఉంటుంది. ఒక పాము చుట్ట చుట్టుకుని ఉంటే ఎలా ఉంటుందో మన శరీరంలో కూడా అలాగే ఉంటుంది. గుంజీళ్ళు తీయడం వలన ఈ పాము చుట్టుకుని ఉన్నది మెల్లమెల్లగా కదులుతూ ఉంటుంది. ఈ కదలికలు మూలాధారంలో ప్రారంభమై చివరకు సహస్రారం వరకు చేరుతాయి. అప్పుడు మాత్రమే వ్యక్తి తన కొరకు కాకుండా లోకం కొరకు ఆలోచించే వారుగా మారతారు. జడత్వం నుంచి చైతన్యం వైపు ప్రయాణం చేయాలనుకునే వారు అందరూ కూడా ప్రతీ రోజు గుంజీళ్ళు తీయడం ఈ గణపతి నవరాత్రులలో ప్రారంభించి అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

 

click me!