తూర్పువైపు తిరిగి కూర్చుంటే.. ఏమిటి లాభం?

By ramya neerukondaFirst Published Nov 21, 2018, 3:27 PM IST
Highlights

తూర్పునుంచి ప్రాణశక్తి వస్తుంది. సూర్యుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. దీనిని గురించి పాశ్చాత్య దేశ శాస్త్రజ్ఞుడు డా. జార్జిస్టర్‌గారు చెప్పారు.

రోజూ ఏదైనా పూజలు చేసేటప్పుడు, జపం చేసుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, భోజనానికి, ముఖం కడుక్కోవడానికి మొదలైన అన్ని పనులకు తూర్పు దిశగానే ముఖం ఉంచి కూర్చోవాలని మన పెద్దలు చెప్పారు ఎందుకు? అంటే

ఆయుష్షును కోరేవారు తూర్పు ముఖంగాను, యశస్సును కోరేవారు దక్షిణముఖంగాను కూర్చుండి భోజనం చేయాలని మనుస్మృతి తెలుపుతుంది.

మన భూమి అయస్కారతావరణం ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతుంది. ఉత్తరమును ధన ధ్రువంగాను, దక్షిణాన్ని ఋణ ధ్రువంగా శాస్త్రజ్ఞులు నిరూపించారు. ధన ధ్రువంలో ఆకర్షణ శక్తి (పాజివ్‌నెస్‌), ఋణ ధ్రువంలో వికర్షణ అనగా (వ్యతిరేకశక్తి) ఉన్నాయని ఋజువు చేసారు. కనుక ఉత్తరంగా కూర్చున్నా పడుకున్న వారు ఆకర్షక ప్రభావాన్ని పొందుతారని, అందువలన వాత రోగాలు (నర్వస్‌ వ్యాధులు) వస్తాయని చెప్పవచ్చు.

సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే భూమి పడమర నుండి తూర్పుదిశకు తిరుగుతున్నట్లు అర్థం. భూమి తిరుగుతున్నట్లుగా మనం కూడా కూర్చుని పూజలు, జపాలు, భోజనాలు చేయడంలోని అంతర్యం.

బస్సులో ప్రయాణించేవారికి డ్రైవరు వైపు తిరుగి కూర్చున్నప్పుడు సాధారణంగా ఉంటుంది. కాని డ్రైవరుకు వ్యతిరేకంగా కూర్చున్నప్పుడు తేడా తెలుస్తుంది. బస్సు ముందుకు వెళుతుంటే వ్యతిరేక దిశలో మనకు కనిపిస్తుంది. కాబట్టి  తూర్పుదిశకు తిరిగి కూర్చోవడం అంటే డ్రైవరువైపుకు తిరిగి అనుకూల దిశలో కూర్చోవడం అని అర్థం ఇదే మంచిది.

తూర్పునుంచి ప్రాణశక్తి వస్తుంది. సూర్యుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. దీనిని గురించి పాశ్చాత్య దేశ శాస్త్రజ్ఞుడు డా. జార్జిస్టర్‌గారు చెప్పారు.

ఉత్తరంగా కూర్చుండి ఆహారం తీసుకుంటే విద్యుత్‌ అయస్కాంతశక్తి నరాల ద్వారా అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. ఆ వేగాన్ని తట్టుకునే శక్తి శరీరానికి ఉండదు. అందువలను అలా కూర్చుని తినరాదు. యశస్సుకావాలనుకునేవారు దక్షిణ దిశగా,  ఆయుష్షు కావాలనుకునేవారు తూర్పు ముఖంగానే ఉండాలి. ఆయుష్షు కావాలని అందరూ కోరుకుంటారు కాబట్టి తూర్పు ముఖంగా కూర్చుని అన్ని పనులు చేయడం శ్రేయస్కరం.

డా.ఎస్.ప్రతిభ

click me!