Vastu Tips: ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

By telugu news teamFirst Published Jun 11, 2022, 2:35 PM IST
Highlights

ఇంట్లో లక్ష్మీ దేవి తిరగాలి అంటే... వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట.  ముఖ్యంగా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. 

ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలని అందరూ కోరుకుంటారు. తమ సంపాదన పెరిగి.. ధన వంతులు అవ్వాలని అందుకోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే.. ధనవంతులు కావాలంటే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. ఇంట్లో లక్ష్మీ దేవి తిరగాలి అంటే... వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట.  ముఖ్యంగా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం..

ఇంటి పరిశుభ్రత ఇలా ఉండాలి:
ఇంటిని మెయిన్ డోర్ నుండి శుభ్రం చేయండి: లక్ష్మి దేవి శుభ్రత అంటే ఎక్కువ. ఇళ్లు శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది. కాబట్టి.. ఇంటి తోపాటు.. గుమ్మాన్ని శుభ్రం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే.. లక్ష్మీ కాటాక్షం అంత పెరుగుతుంది. 

నిత్యం ఇంట్లో డబ్బు ఉండాలి అంటే: శుభ్రమైన ఇంట్లో లక్ష్మి స్థిరంగా  ఉండాలంటే.. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. గృహోపకరణాలను సరైన స్థలంలో ఉంచాలి. చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంటి సభ్యుల పనులన్నీ చక్కగా నిర్వహించబడతాయి. ఇంట్లో పురోగతిని కనుగొనవచ్చు. ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కలగకుండా.. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

ప్రతి మూలను శుభ్రం చేయండి: వాస్తు ప్రకారం, ఇంట్లోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేయాలి. ఫర్నీచర్, సోఫాలు, బెడ్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి మూలల్లో దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. అందువల్ల,  మూలలను బాగా శుభ్రం చేయాలి.

బాత్‌రూమ్‌ క్లీనింగ్‌: ఇంటి బాత్‌రూమ్‌, టెర్రస్‌, బాల్కనీని కూడా సరిగ్గా శుభ్రం చేయాలి. మీ బాత్రూమ్ మురికిగా ఉంటే రాహువు ఇబ్బంది పడవచ్చు. చెడు రాహువు మీ జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. అదనంగా, ఇంటి పై కప్పు దుమ్ము లేదా ఏదైనా చెత్త ఉంటే తల్లి లక్ష్మి మీపై కోపంగా ఉంటుంది. ఇల్లు మురికిగా ఉంటే వాస్తు దోషం వెంటాడుతుంది.

సూర్యాస్తమయం తర్వాత చెత్తను ఊడ్చవద్దు: వాస్తు ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఎందుకంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయంగా భావిస్తారు. చెత్తను బయట వేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని భయపడతారు. అంతే కాకుండా చీపురుతో ఇంటిని ఊడ్చకూడదు.

click me!