భార్యభర్తలు ఆనందంగా ఉండాలంటే వాస్తు ప్రకారం ఇలా చేయాల్సిందే..!

Published : Mar 19, 2022, 02:31 PM IST
భార్యభర్తలు ఆనందంగా ఉండాలంటే వాస్తు ప్రకారం ఇలా చేయాల్సిందే..!

సారాంశం

ఎప్పుడూ ప్రేమగా ఉండాలంటే.. ఇవిగో ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తులో కొన్ని మార్పులు చేసుకుంటే జీవితం ఆనందంగా సాగుతుందట.

ప్రతి ఒక్కరూ పెళ్లైన కొత్తలో భార్య పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఎన్ని పనులు ఉన్నా భార్య వెంటే తిరుగుతుంటారు. కానీ.. పెళ్లై కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఆసక్తి తగ్గిపోతుంది. 

మరి అలా తగ్గిపోకుండా.. ఎప్పుడూ ప్రేమగా ఉండాలంటే.. ఇవిగో ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తులో కొన్ని మార్పులు చేసుకుంటే జీవితం ఆనందంగా సాగుతుందట.

1.బెడ్రూమ్ లో వాయువ్య గోడపై ఆకాశంలో ఎగురుగుతున్న తెల్ల పావురం ఉన్న ఫోటోని ఉంచాలి. అయితే.. ఆ ఫోటోలో నీరు మాత్రం ఉండకూడదు.

2. కొంచెం కోపం ఎక్కువగా ఉండేవారు... వారి ఇంట్లో లివింగ్ రూమ్ లోని వాయువ్య మూలలో కూర్చోవాలి. దాని వల్ల మానసిక స్థితి మెరుగు పడుతుంది. కోపం కూడా తగ్గుతుంది.
 

3.ఇంట్లోని ఫర్నిచర్  పింక్, బ్లూ, గ్రీన్, పీచ్,  వైట్ లాంటి మృదువైన రంగులలో ఎంచుకోవాలి. 


4.బెడ్ రూమ్  వాయువ్య మూలలో నెమలి పింఛాలను ఉంచాలి.

5.గదిలో నైరుతి మూలలో స్వచ్ఛమైన మరియు శుభ్రమైన క్రిస్టల్  ఉంచాలి.

6.ఆకుపచ్చ, తెలుపు రంగు నైట్ ల్యాంపులు పెట్టుకోవడం వల్ల సాఫ్ట్ ఫీలింగ్స్ కలుగుతాయి.

7.బెడ్రూమ్ లో రాధాకృష్ణుడి ఫోటోపెట్టుకుంటే.. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మరియు ఎప్పటికీ సన్నిహితంగా ఉండగలుగుతారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ketu Transit 2026: కొత్త ఏడాదిలో 3 రాశులపై కేతువు కరుణ, డబ్బుతో పాటూ గౌరవం ఇస్తాడు
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!