Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మేష రాశివారి జాతకం ఎలా ఉండనుంది..!

By telugu news team  |  First Published Mar 26, 2022, 12:27 PM IST

ఈ శ్రీ శుభకృత్ నామ ఉగాది సంవత్సరాదిలో.. మేష రాశివారి కి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మనశాంతి లోపిస్తుంది. ఆర్ధిక, ఆరోగ్య ఇబ్బందులు. అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు. 


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

మేషరాశి వారికి శుభకృత్  నామ సంవత్సరంలో ఆదాయం - 14, వ్యయం -14 సమానంగా ఉంటుంది. 

Latest Videos

undefined

రాజపూజ్యం-3, అవమానం - 06 గా ఉంటుంది. 

మేషరాశి వారికి శుభకృత్ నామ సంవత్సరంలో 

* గురుగ్రహ ఫలితాలు :- ప్రభావం 6 ఏప్రిల్ 2022 వరకు 11 ఇంట సంచారం వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. తేదీ 7-4-2022 నుండి వ్యయ భావ సంచారం వలన  ప్రతికూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు అనవసరంగా దూర ప్రయాణాలు చేయొచ్చు. ఎక్కుల ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. స్థాన మార్పులు. వాద ప్రతివాదంలో ఓటమి చవి చూడాల్సి వస్తుంది. ఋణాలు చేయవలసి అవసరం రావచ్చు. బంధు మిత్రుల వలన ఇబ్బందులు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపాలలో ఇక్కట్లు ఏర్పడతాయి.  
 
* శని "దేవును" గ్రహ ఫలితాలు:- ఫిబ్రవరి 2023  వరకు 10 వ స్థానంలో జీవిత భాగస్వామి, సంతానం వలన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మార్పులు గోచరిస్తున్నాయి. ఋణ ఒత్తిడి. ఆస్తి పంపకంలో జాగ్రత్త పడాలి. ప్రతి వ్యవహారంలో చికాకులు, వ్యతిరేకతలు కనబడతాయి. 2023 ఫిబ్రవరి 11 నుండి  లాభ స్థాన సంచారం వలన అనుగ్రహం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కొత్త ఇంట్లోకి అడుగులు పెట్టొచ్చు. కుటుంబ , ఆరోగ్య, ఆర్ధిక విషయాలలో అనుకూలతలు కనబడుతాయి. సహాయ సహకారాయలు పొందుతారు. 

* రాహువు సంవత్సరం అంతా వృషభరాశిలో ఉంటాడు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మనశాంతి లోపిస్తుంది. ఆర్ధిక, ఆరోగ్య ఇబ్బందులు. అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు. 

కేతువు ఈ సంవత్సరం అంతా వృశ్చికరాశిలో సంచారం వలన  కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. ఆరోగ్య లోపం. పనులలో ఆటంకాలు ఏర్పడే సూచలున్నాయి. మనో వెధన, కుటుంబ" కళత్ర" కలహాలు ఏర్పడే విధంగా గోచరిస్తున్నది.    

సంఘంలో గౌరవం లోపిస్తుంది, 

తొందరపాటుతనం ఎక్కువవుతుంది, 

నోరు జారే పరిస్థితులు ఎదురవుతాయి. 

వచ్చిన డబ్బు నీరు లాగా ఖర్చు పెడతారు.
 
స్నేహితుల వలే నమ్మకద్రోహులు చెంతన చేరుతారు. 

ఏప్రిల్ మే జూన్ నెలలు లాభావంతంగా వున్నాయి. 

ఆగష్టు సెప్టెంబర్ నెలలో సామాన్య ఫలితాలు. 

నవంబర్ డిసెంబర్ నెలలో తీవ్ర ఇబ్బందులు. 

జూన్ జులై మాసాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా బాగా వున్నాయి. 

అనవసరమైన స్నేహాలు చేయకండి. 

వచ్చిన డబ్బుతో స్థిరాస్థులు కొంటే మంచిది. 

ఆర్ధిక వ్యవహారాలలో ముందు చూపు అవసరం. 

అనవసర ఖర్చులను నిరోధించండి. 

డబ్బును ముందుగానే సేవింగ్స్ రూపంలో భద్రపరచండి. 

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..   ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు..  మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య 
 

click me!