శ్రీ శోభకృత్ నామ సంవత్సర: తుల రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

By telugu news team  |  First Published Mar 17, 2023, 2:55 PM IST

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం తుల రాశివారికి ఈ ఏడాది  జీవిత భాగస్వామి తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. సమాజము నందు అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనసునంగా ఆందోళనగా ఉండుట.


 
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

Latest Videos

undefined

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
 ఆదాయం:-14
వ్యయం:-11
రాజపూజ్యం:-7
అవమానం:-7

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి షష్టమ స్థానము నందు సంచారం చేసి ఏప్రిల్ 21 నుండి సప్తమ స్థానము నందు  సంచారం చేయను.

శని:-సంవత్సర ప్రారంభం నుండి పంచమ స్థానం నందు సంచారం చేయను.

రాహు:-సంవత్సర ప్రారంభం నుండి సప్తమ స్థానము నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి షష్టమ స్థానమునందు సంచారం చేయను.

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి జన్మస్థానమునందు సంచారం చేసి తదుపరి అక్టోబర్ 31 నుండి ద్వాదశస్థానం నందు సంచారం చేయను.


సంవత్సర ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. వృత్తి వ్యాపారం నందు అభివృద్ధి కనబడును. ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. సంతానం కోసం ఎదురు చూసేవారు శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసవంతమైన వస్తువులు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజము నందు గౌరవ ప్రతిష్ట లభించును. స్త్రీ సహాయము తోటి కొన్ని సమస్యలు తీరగలవు. నిరుద్యోగులకు  ఉద్యోగ అవకాశాలు లభించును. ఉద్యోగస్తులు ఉన్నతాధికారం పొందగలరు. రాజకీయ నాయకులకు ప్రజాధరణ పొందుతారు. కోర్టు కేసులు వివాదాలు పరిష్కారమగును. సాహసోపేత కార్యాలు యందు విజయం సాధిస్తారు. చేయపనలలో కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. అనవసర ప్రయాణాలయందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రావలసిన బాకీలలో ఇబ్బందులు ఎదురవుతాయి. గృహమునందు శుభకార్యాలు జరుగును. అన్ని రంగాల వారికి అనుకూలమైన సంవత్సరము. ఈ సంవత్సరం ఈ రాశి వారు శనికి మరియు నవంబర్ నెలలో కేతువు గ్రహానికి జప హోమ దానాలు చేసుకోవడం మంచిది.

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సర: కన్య రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు


ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 

ఏప్రిల్
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తలపెట్టిన పనులలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా తర్వాత పూర్తవును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. ఉద్యోగమునందు అధికారులతోటి వివాదాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల తోటి ప్రతికూలత వాతావరణం. అకారణంగా కోపం వస్తుంది. ఇతరులతోటి వివాదాలు ఏర్పడగలవు. వ్యాపారాలు అనుకూలంగా ఉండవు.

మే
బంధుమిత్రుల యొక్క కలయక. వ్యాపారాలు రాణిస్తాయి. ఉద్యోగవనందు అధికారుల  మన్ననలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. సమాజము నందు అపవాదములు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనసునంగా ఆందోళనగా ఉండుట.

జూన్
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండవలెను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు అధికారుల వలన సమస్యలు ఏర్పడవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది.

జూలై
ఈనెల అన్ని విధాల యోగించును. ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ప్రయత్నించిన కార్యాలు ఫలిస్తాయి. ఇష్టమైన , విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఆగస్టు
ఆరోగ్యం బాగుంటుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అన్నదమ్ముల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. బంధుమిత్రులతోటి సత్కాకాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులుసకాలంలో పూర్తి చేస్తారు.

సెప్టెంబర్
ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. వ్యాపారమునందు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు. సమాజం నందు అపవాదములు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు.

అక్టోబర్
వృత్తి వ్యాపారమునందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది. ఉద్యోగమునందు అధికారులతోటి నిరాదరణ , సమస్యలు ఏర్పడగలవు. శారీరక శ్రమ పెరుగుతుంది. తలపెట్టిన పనులు నెలాఖరులో పూర్తవును. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు చికాకులు తప్పవు. ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.

నవంబర్
ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండవలెను. తలపెట్టిన పనులు పూర్తి కాక‌‌‌ ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగమునందు అధికారులతోటి విభేదాలు తలెత్తవచ్చు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చేయి వ్యవహారమునందు ఉద్రేకతులను కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను.

డిసెంబర్
ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగును. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తిఅవును. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. గృహమునందు శుభకార్యాచరణ.

జనవరి
ఆర్థికంగా బలపడతారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలుగచేస్తుంది. సమాజము నందు మీ విలువకు తగ్గ గౌరవం లభిస్తుంది.

ఫిబ్రవరి
వృత్తి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందును. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అధికారుల  సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాల ఈ మాసం యోగించును. ఆర్థికంగా బలపడతారు. రాజకీయ నాయకులు ప్రజల  ఆదరణన పొందగలరు.

మార్చి
బందు సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగము నందు అధికార అభివృద్ధి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు అన్న విధాల యోగించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పరీక్ష యందు ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవహారాలు ఆటంకాల లేకుండా పూర్తి చేసుకుంటారు.
 

click me!