Tortoise ring: తాబేలు ఉంగరాన్ని వీళ్లు అస్సలు పెట్టుకోకూడదు!

Published : May 28, 2025, 07:23 PM IST
Tortoise ring: తాబేలు ఉంగరాన్ని వీళ్లు అస్సలు పెట్టుకోకూడదు!

సారాంశం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం పెట్టుకోవడం శుభప్రదం. ఈ రింగ్ పెట్టుకుంటే.. సంతోషం, సిరి, సంపదలు పెరుగుతాయని నమ్మకం. కానీ కొన్ని రాశుల వారు తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది కాదట. ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.

పురణాల ప్రకారం తాబేలును.. విష్ణువు అవతారంగా భావిస్తారు. తాబేలు ఉంగరం పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. సాధారణంగా ఈ ఉంగరాలు వెండి లేదా కాపర్‌తో తయారవుతాయి. ఈ ఉంగరం వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీని తొలగించి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ తెస్తుందని నమ్మకం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఈ ఉంగరాన్ని పెట్టుకోకూడదట. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

తాబేలు ఉంగరం పెట్టుకుంటే ఏమవుతుంది?

జ్యోతిష్యం ప్రకారం తాబేలు ఉంగరం వ్యక్తులను ఆర్థికంగా బలోపేతం చేస్తుందట. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు, వృద్ధి కలుగుతాయట

వాస్తు దోషాలు తొలగుతాయి!

వాస్తు దోషాలున్నవారికి తాబేలు ఉంగరం శుభప్రదంగా భావిస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీని తగ్గించి.. పాజిటీవ్ ఎనర్జీని పెంచుతుందట.

ఏ చేతి వేలికి ధరించాలి?

తాబేలు ఉంగరాన్ని ఎప్పుడూ కుడిచేతి మధ్యవేలికి ధరించాలి. తప్పుడు వేలికి ధరిస్తే లాభం కాకుండా నష్టం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఏ లోహంతో ఉండాలి?

ప్రతి వ్యక్తి జాతకం ఆధారంగా లోహ ప్రభావం మారుతుంది. కొందరికి వెండి శుభప్రదం. మరికొందరికి కాపర్ శుభప్రదం. జ్యోతిష్య సలహా లేకుండా ఉంగరం ధరిస్తే నష్టం జరగవచ్చు. కాబట్టి ఏ లోహంతో ఈ ఉంగరం ధరించాలో జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఎవరు పెట్టుకోకూడదు?

జాతకంలో శని లేదా కుజుడి ప్రభావం ఎక్కువగా ఉన్నవారు సలహా లేకుండా ఈ ఉంగరం ధరించకూడదు. జీవితంలో తీవ్ర అసమతుల్యత ఉన్నవారు జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.

ఈ రాశుల వారు ధరించకూడదు!

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష, కన్య, వృశ్చిక, మీన రాశుల వారు ఈ ఉంగరం ధరించకూడదు. వృషభ, మకర రాశుల వారికి శుభప్రదం.

రింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి?

తాబేలు ఉంగరాన్ని శుక్ర లేదా శనివారాల్లో ధరించడం శుభప్రదం. ధరించే ముందు గంగాజలం లేదా పాలతో శుద్ధి చేయాల్సి ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jupiter Moon Conjuction: గురు చంద్రుల కలయికతో గజకేసరి యోగం, ఈ 5 రాశులదే అదృష్టమంతా
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు!