ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శత్రువులపై విజయానికి ప్రయత్నిస్తారు. పోటీల్లో గెలుపు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఋణబాధలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. లలతాపారాయణ మంచి ఫలితాలిస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సృజనాత్మకతను కోల్పోయే ప్రమాదం. ఆలోచనలు తగ్గించాలి. మానసిక ప్రశాంతత పెంచుకునే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు తలెత్తే సూచనలు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. వాికై ఆరాట పడతారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. మానసిక అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. స్త్రీలు అనుకూలిస్తాయి. సహాయ సహకారాలుాంయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రచార ప్రసార సాధనాలు లాభిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. బంధువర్గీయులతో ఆత్మీయత ఏర్పడుతుంది. లలితా పారాయణం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కోల్పోతారు. వాగ్దానాల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాల జోలికి పోకూడదు. కింసంబంధ లోపాలు వచ్చే సూచనలు. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త అవసరం. లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొంత సంతృప్తి వచ్చే సూచనలు. శుభ కార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. ఆహారంపై దృష్టి పెంచుకుాంరు. ఆరోగ్యం కాపాడుకోవాలి. లలితా సహస్ర నామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులు ఉంాయి. చిత్త చాంచల్యం ఉంటుంది. నిత్యావసర ఖర్చులపై దృష్టి అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. సుఖంకోసం ఆరాట పడతారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంాయి. లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సమిష్టి ఆదాయాలు వస్తాయి. కళాకారులతో అనుకూలత ఉంటుంది. మంత్రం, దీక్ష, ఉపాసనలు పెంచుకునే ప్రయత్నం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కంపెనీలు, షేర్లు మొదలైన వాిపై దృష్టి పెరుగుతుంది. సమస్యలన్నికీ పరిష్కారం లభిస్తుంది. లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో స్త్రీలతో అనుకూలత ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం. దేవీ ఉపాసన, లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. దూరదృష్టి ఏర్పడుతుంది. పరిశోధకులకు కష్టకాలం. పెద్దలతో జాగ్రత్త అవసరం. దేవీ ఉపాసన, లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య సమస్యలు ఉంాయి. శ్రమలేని సంపాదనపైదృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. వైద్యశాలల సందర్శనం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరాశ్రయ ఉంటుంది. ఆకస్మిక ఇబ్బందులు. మానసిక ప్రశాంతత అవసరం. లలితాపారాయణ శుభం చేకూరుతుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. వాివల్ల సంతోషం కలుగుతుంది. భాగస్వాములతో సహకారం లాభిస్తుంది. పదిమందిలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. లలితాపారాయణ మంచి ఫలితాలనిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ