16ఫిబ్రవరి2019శనివారం రాశిఫలాలు
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : గృహం వల్ల అసౌకర్యం ఉంటుంది. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేసుకోవాలి. ప్రయాణాలపై ఆసక్తి. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఆహారంలో సమయ పాలన అవసరం. శ్రమను తట్టుకుని నిలబడాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఇతరుల సహకారం లభిస్తుంది. పనులలో ఒత్తిడి ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాగ్ధోరణి తగ్గించుకోవాలి. అనవసర మాటల వల్ల గొడవలు, ఇబ్బందులు వచ్చే సూచన. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి పెడతారు. కిం సంబంధ లోపాలు.శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పనులలో ఒత్తిడి ఉంటుంది. శారీరక శ్రమ అధికం. కార్యసాధనలో పట్టుదల అవసరం. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర భయాలు ఏర్పడే సూచన. గుర్తింపుకోసం ఆరాట పడతారు. చిత్తచాంచల్యాన్ని తగ్గించుకోవాలి. జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర వ్యయాలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతికై ఆలోచిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. మానసిక ఒత్తిడి ఉంటుంది. పరాధీనత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సమిష్టి ఆశయాలు సాధిస్తారు. ఇతరుల ద్వారా ఆదాయ సంపాదన. ఇతరులపై ఆధారపడతారు. కళాకారులకు అనుకూల సమయం. ఆదర్శవంతమైన జీవితం కోసం ఆరాటం. కాలాన్ని సద్వినియోగం చేసుకుటాంరు. శ్రమాధిక్యం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన అవసరం. విద్యార్థులకు ఒత్తిడి సమయం. పరిశోధకులకు అవనసర ఇబ్బందులు ఉంటాయి. దూరదృష్టితో ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమలేని ఆదాయం వస్తుంది. ఊహించని ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చెడు మార్గాల ఆదాయ సంపాదన. క్రయ విక్రయాలపై ఆలోచన తగ్గించుకోవాలి. పరాశ్రయం ఉంటుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. శత్రువులతో పోరానికి సంసిద్ధ కావద్దు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోనల్లో ఉన్నతి ఉంటుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ఒత్తిడి ఉంటుంది. సంతాన సమస్యలు ఏర్పడతాయి. సృజనాత్మకతన కోల్పోతారు. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు కష్ట కాలం అవుతుంది. ఆత్మీయ అనురాగాలు దెబ్బతింయి. బంధాలను కాపాడుకోవాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.