ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అధికారిక ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సంతానం వల్ల సమస్యలు ఉంటా యి. పరిపాలన సమర్ధత పెరుగుతుంది. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. చేసే అన్ని పనుల్లో అనుకున్నంత మంచి ఫలితాలు సాధించలేరు. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాతృసౌఖ్యం లోపిస్తుంది. అన్ని రకాల సౌకర్యాలు దూరమౌతాయి. వాహనాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. గృహంలో అనుకున్న పనులు పూర్తి కావు. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారిక సౌకర్యాల వల్ల జాగ్రత్త. ఆదిత్యహృదయ స్త్తోత్ర పారాయణ శుభఫలితాలనిస్తుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారుల సహకారం లభిస్తుంది. అధికారిక ప్రయాణాలు లాభిస్తాయి. ప్రణాళికాబద్ధమైన పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక పనులపై దృష్టి ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది. పరామర్శలు చేస్తారు. శ్రీరామ జయరామజయజయరామరామ జపంమంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మ్లాడున్నప్పుడు జాగ్రత్త అవసరం. అధికారిక ధోరణి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కిం సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. నిల్వ ధనంపై ఆసక్తి పెరుగుతుంది. సంపాదనకు ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఉద్యోగంలో మార్పులకు సూచన ఉంటుంది. సుఖదుఃఖాలు అనుకూలంగా ఉంటా యి. అనుకున్నపనులు శ్రమతో పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి అధికం. ఆలోచనల్లో మార్పులు వస్తూటా ంయి. పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ఆశయాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. సూర్యాష్టకం పఠించటం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికార గృహాల్లో నివాసానికై ప్రయత్నం చేస్తారు. అధికారిక ఖర్చులు ఉంటా యి. పాదాల సంబంధ నొప్పులు, కిం బాధలు ఏర్పడతాయి. విశ్రాంతికోసం ఆరాట పడతారు. ఇతరులపై ఆధారపడడం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అధికారిక లాభాలు ఉంటా యి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆశయాలు నెరవేరుస్తారు. సమిష్టి ఆదాయాలు లభిస్తాయి. కంపెనీల్లో వాలకై ప్రయత్నం చేస్తారు. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక గృహాల్లో నివాసం. సంఘంలోగౌరవం కోసం ఆరాటం, గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది. చేసే వృత్తుల్లో అనుకూలత, రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారు. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచనలు పెరుగుతుంది. సజ్జన సాంగత్యం పెరుగుతుంది. విశాలమైన భావాలపై ఆలోచనలు ఉంటా యి. దూర ప్రయాణాలపై ఆలోచనలు పెరుగుతుంది. జాగ్రత్త అవసరం. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అప్రమత్తత అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అనుకోని ఖర్చులు ఉంటా యి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. జాగ్రత్త అవసరం. దాన ధర్మాలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. పదిమందిలో పలుకుబడికోసం ఆలోచిస్తారు. ఓం నమశ్శివాయ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమాధిక్యం ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పోీల్లో గెలుపు ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణాల వల్ల అనుకూలత ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వృత్తి విద్యలో పై చేయి ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యాష్టకం పఠించడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ