07జూన్ 2019 శుక్రవారం రాశిఫలాలు

By telugu team  |  First Published Jun 7, 2019, 7:43 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరిశోధనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అధిక శ్రమతో ఉత్తమ ఫలితాల సాధన ఉంటుంది. సజ్జన సాంగత్యానికి ప్రయత్నం. దూరదృష్టి ఉంటుంది. ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. తీర్థయాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చెడు మార్గాల ద్వారా ఇబ్బందులు. ఇతరులపై ఆధారపడతారు. అనవసర పనుల్లో జోక్యం కూడదు. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఇబ్బందులు ఏర్పడతాయి. అవయవలోపం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.  సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. భాగస్వామ్య సంబంధాలు పెంచుకుటాంరు. పదిమందిలో పలుకుబడికోసం ఆరాటపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది.  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. సేవకులతో అనుకూలత పెరుగుతుంది. పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు.  శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సంతాన సమస్యలు ఉంటాయి. సృజనాత్మకత లోపం ఉంటుంది. కళాకారులకు ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. పరిపాలన సమర్ధత పెరుగుతుంది. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడులు ఏర్పడతాయి. గృహ సంబంధ లోపాలు ఏర్పడతాయి. అనారోగ్య సూచన. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అసంతృప్తి ఉంటుంది. జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. సహాధ్యాయులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. చిత్త చాంచల్యం పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి.   పరామర్శలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాటల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. కింసంబంధ లోపాలు ఏర్పడతాయి. వాగ్దానాలు ఆటంకపరుస్తాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం. పనిలో ఒత్తిడి ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు అవసరం. పట్టుదలతో కార్యసాధన అవసరం. మంచి కృషిశీలతఉంటుంది. ఆశయాల సాధన చేసుకుటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. నిద్రాభంగం ఏర్పడుతుంది. సుఖంకోసం ఆరాటపడతారు. అన్నివిధాల ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో ఆసక్తి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. దురాశ ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. సాత్విక ఉపాసనపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక గౌరవం పెంచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. సేవకులతో అనుకూలత ఏర్పడుతుంది. సాంఘిక రాజకీయ విషయాలపై  ఆలోచన పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

click me!