Today Horoscope: ఓ రాశివారు పిల్లల విషయంలో ఒక చెడు వార్త వింటారు

Published : Aug 29, 2024, 05:30 AM IST
 Today Horoscope: ఓ రాశివారు పిల్లల విషయంలో ఒక చెడు వార్త వింటారు

సారాంశం

Today Horoscope:రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది... వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి కలిసి వస్తుంది..? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి..? ఈ రోజు రాశిఫలాల్లో మనం తెలుసుకుందాం.  

Today Horoscope:రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది... వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.. ఎవరికి కలిసి వస్తుంది..? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి..? ఈ రోజు రాశిఫలాల్లో మనం తెలుసుకుందాం.

మేషం:

అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ పనితనం సమాజంలో గౌరవించబడుతుంది. స్నేహితుడి కష్టాన్ని తీరుస్తారు. ఎన్ని పనులు ఉన్నా కుటుంబంతో కాసేపు గడపండి. పిల్లల సమస్యలను పరిష్కరించడానికి మీ సహాయం అవసరం. భాగస్వామ్య వ్యాపారంలో కొంత ఒప్పందాలు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. 

వృషభం:

ఈ రోజు మీ స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. ఇది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇంట్లోకి విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి పెద్దల గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. యువత తప్పుడు కార్యకలాపాలను విడిచి కెరీర్‌ కు ప్రాధాన్యతనివ్వాలి. వ్యాపార కార్యకలాపాలలో ఏదైనా కొత్త ప్రణాళికలు వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. 

మిథునం:

ఈ రోజు ఒక పనిపైనే మీ దృష్టంతా ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. దీని వల్ల  రిలేషన్ షిప్ లో గ్యాప్ పెరుగుతుంది. భూమి కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక ఉంటే ఈ రోజు దీని జోలికి వెళ్లకండి. వ్యాపారంలో కొన్ని అనుకోని సమస్యలు వస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉంటాయి. 

కర్కాటకం:

మీ ఆసక్తికి సంబంధించిన కార్యకలాపాలకు ఈరోజు కొంత సమయాన్ని కేటాయించండి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్‌గా ఉంటారు. కొత్త శక్తిని పొందుతారు. కుటుంబానికి సంబంధించి కొనసాగుతున్న ఏదైనా సమస్య కూడా ఈ రోజు పరిష్కరించబడుతుంది. పాత ప్రతికూల విషయాలు వర్తమానాన్ని ఆధిపత్యం చేయనివ్వకండి. దీనివల్ల సన్నిహిత వ్యక్తితో సంబంధం చెడిపోతుంది. దగ్గరి బంధువు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పెరుగుతాయి. పబ్లిక్ డీలింగ్, మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాల్లో విజయం  మీదే. 

సింహ రాశి:

మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల సలహా కంటే మీ స్వంత నిర్ణయానికూ ప్రాధాన్యతనివ్వండి. ఈ సమయంలో ఇంట్లో కొన్ని రకాల మార్పులు చేస్తారు. కాలానుగుణంగా మీ జీవనశైలిని మార్చుకోవడం అవసరం. మీరు చేసే ప్రతి పనిలో చాలా క్రమశిక్షణ, కఠినంగా ఉండటం ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపార కార్యకలాపాలలో ఉద్యోగులు, సిబ్బంది సలహాలకు కూడా ప్రాముఖ్యతనివ్వండి. భార్యాభర్తల మధ్య అనుబంధంలో మాధుర్యం ఉంటుంది. 

కన్య:

ఇంట్లోకి బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకండి. లేదంటే వివాదాల్లో చిక్కుకుంటారు. అలాగే సమాజంలో మీపట్ల గౌరవం పోతుంది. ఈ సమయంలో మీ అన్ని కదలికలను సహనం, నిగ్రహంతో చేయడం అవసరం. వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్దిష్ట నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. వైవాహిక జీవితంలో సరైన సామరస్యం ఉంటుంది. అధిక పని భారం వల్ల అలసటతో కూడిన స్థితి ఉంటుంది.

తుల:

ఈరోజు ఒక ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. గృహ నిర్వహణ పనుల్లో మెరుగుదల ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. కోపం మీ పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. పిల్లల గురించి ఒక చెడు వార్త వింటారు. ఇది మీ మనసుకు ఆందోళన కలిగిస్తుంది. సాంకేతిక రంగానికి సంబంధించిన పనుల్లో విజయాన్ని అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు పెరగొచ్చు.

వృశ్చికం:

గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. సోదరులతో కూడా ఆనందంగా గడుపుతారు. బంధువుల రాకతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విబేధాలు రావొచ్చు. ఒకరి అభిప్రాయాలను మరొకరు అర్థం చేసుకోవాలి. గౌరవించుకోవాలి. ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లడం వల్ల విశ్రాంతి, శాంతి లభిస్తాయి. వ్యాపారానికి సంబంధించి చిన్న విషయమైనా సరే శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో శాంతి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలెర్జీలకు సంబంధించిన సమస్య రావొచ్చు. 

ధనుస్సు:

సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ నిర్దిష్ట ప్రాజెక్ట్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రసంగం, నటనా శైలికి ప్రజలు ఆకర్శితులు అవుతారు. పరుగులెత్తినా అలసిపోరు. సమయం విలువను గుర్తించండి. సరైన సమయంలో సరైన పని చేయకపోవడం మిమ్మల్ని బాధపెడుతుంది. మీ వ్యవహారాల్లో ఓర్పు, సౌమ్యత చాలా అవసరం. పాత ఆస్తులకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరకడం కష్టం. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో పాత విభేదాలు పరిష్కరించబడతాయి. మీరు అన్ని సౌకర్యాలను జాగ్రత్తగా చూసుకోవాలి. 

మకరం:

ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లే అవకాశం ఉండొచ్చు. మీ కలలను నెరవేర్చడానికి ఇది మంచి సమయం. ఇంటికి అతిథి ఆకస్మిక రాక ఆందోళన, ప్రతికూలతకు దారితీస్తుంది. ఇప్పుడు ఎలాంటి ప్రయాణం చేయకండి. పొరుగువారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యాపార సంబంధిత నిర్ణయాలు వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన, సరైన సామరస్యం ఉంటుంది. సమయం ఆరోగ్యానికి అనుకూలంగా లేదు. 

కుంభ రాశి:

ఈ టైంలో తెలివిగా తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను కలిగిస్తాయి. మీ యోగ్యత, సరైన పని వ్యవస్థ మీ పనిలో మరింత వేగాన్ని అందిస్తాయి. యువత తమ అజాగ్రత్త లేదా ఆచరణాత్మక నైపుణ్యాల కొరత వల్ల వ్యాపార విషయాలలో ద్రోహం చేయొచ్చు. అతి ఆలోచన ఎన్నో అవకాశాలు పోయేలా చేస్తుంది. మీ వ్యాపార కార్యకలాపాల్లో బయటి వ్యక్తులను జోక్యం చేసుకోనివ్వకండి.  వైవాహిక జీవితంలో కొంత అస్థిరత ఉండొచ్చు. ఆరోగ్యం కొద్దిగా  దెబ్బతింటుంది. 

మీనం:

అవకాశవాదంగా ఉండటం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీకు లాభాదాయకంగా ఉంటుంది. అయితే మీరు పనికి తగ్గ ఫలితాన్ని కూడా పొందుతారు. కొన్ని ఖర్చులు ఆకస్మికంగా పెరగొచ్చు. మీపై అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార విషయాలలో మీ అవగాహన, నైపుణ్యం మీకు కొంత విజయాన్ని తెస్తుంది. వైవాహిక జీవితంలో ఒకరితో ఒకరు సామరస్యాన్ని కొనసాగించడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఓపిక చాలా తక్కువ.. ఒక్క నిమిషం ఆలస్యమైనా భరించలేరు!
Baba Vanga Prediction: 2026 అంత భయంకరంగా ఉంటుందా? భయపెడుతున్న బాబా వంగా జోస్యం